భాస్కర – I ఉపగ్రహం
భాస్కర-1 ఉపగ్రహం భారతదేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పెట్టారు.
మిషన్ రకం | Experimental Remote Sensing Earth Obsservation Satellite |
---|---|
మిషన్ వ్యవధి | 10 years (Re-Entered in 1989)[1] |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
అంతరిక్ష నౌక రకం | Unmanned |
తయారీదారుడు | ISRO |
లాంచ్ ద్రవ్యరాశి | 444 కిలోగ్రాములు (979 పౌ.) |
శక్తి | 47 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 7 June 1979 | IST
రాకెట్ | C-1 Intercosmos Launch Vehicle |
లాంచ్ సైట్ | Kapustin Yar |
మొదటి భాస్కరుడు
మార్చుమొదటి భాస్కరుడు సా.శ. 7వ శతాబ్దికి చెందిన భారతీయ గణితవేత్త. శూన్య విలువని సూచించడానికి "0"అనే గుర్తుని మొట్టమొదటగా వాడినవాడు, మొదటి భాస్కరుడు. ఆర్యభటీయంపైన రాసిన భాష్యంలో, సైన్ సంబంధానికి చేసిన ఉజ్జాయింపులు అద్వితీయమైనవి. ఈ ఆర్యభటీయభాష్యం సా.శ. 629లో సంకలితమైంది. ఇది సంస్కృతభాషలోని గణిత, ఖగోళ, జ్యోతిషాలకి సంబంధించి, అత్యంత ప్రాచీనమైన వచనగ్రంథం. ఇతను మహాభాస్కరీయం, లఘుభాస్కరీయం అనే రెండు ఇతర గ్రంథాలను కూడా రాసాడు. భిన్నాల మీద అధ్యయనంలో గణనీయమైన పాత్ర పోషించిన భారతీయ గణితవేత్తలు, భాస్కరుడు, బ్రహ్మగుప్తులు.
భాస్కర – I ఉపగ్రహం
మార్చుభాస్కర -1 ఉపగ్రహం బరువు 444 కిలోలు. ఈ ఉపగ్రహన్నిఅంతరిక్షములో 394 కిలోమీటర్ల పెరిజీ, 399 కిలోమీటర్ల అపోజి ఎత్తులో, 50.7 °. డిగ్రీల ఏటవాలు తలంతో ప్రవేశపెట్టారు.[2] .ఈ ఉపగ్రహాన్ని 1979 వ సంవత్సరం, జూన్ నెల 7వ తారిఖున రష్యాలోని దేశంలోని కాపుస్ యార్‌లోని వోల్గోగ్రాడ్ ప్రయోగవేదిక(Volgograd Launch Station) నుండి C-1 ఇంటర్‌కాస్మోస్ అను ఉపగ్రహ వాహక నౌక ద్వారాఅంతరిక్ష ములో ప్రవేశపెట్టారు. భాస్కర-I, భాస్కర-II రెండు కూడా భారతదేశపు ఇండియన్ స్పేస్ రిసెర్చిఅర్గనైజేసన్(ISRO)తయారు చేసిన ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహం యొక్క పనిచేయ్యు కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పది సంవత్సరాలు కక్ష్యలో తిరిగింది. 1989 లో తిరిగి భూకేంద్రంతో సంపర్కంలోకి వచ్చినది. భాస్కర-I, భాస్కర-II రెండు ఉపగ్రహాలు కూడా లోఎర్తు ఆర్బిట్ (LEO)ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహామలో రెండు టెలివిజన్ కెమారాలు ఉండగా, ఒకటి విసిబుల్ రకం(600 నానో మీటర్లు), రెండవది నియర్ ఇఫ్రారేడ్(800 నానో మీటర్లు) రకం. ఈ ఉపగ్రహం జలవాతావరణం సంబంధించిన సాంకేత విజ్ఞానసమాచారం, అటవీశాస్త్రవిజ్ఞానసమాచారాన్ని, భూవిజ్ఞానంకు సంబంధించిన సమాచారాన్ని అందించినది.
ఉపగ్రహానికి సంబంధిన సాంకేతిక వివరాలపట్టిక[3]
ఉపగ్రహభాగాలు | వివరాలు |
Mission | Experimental Remote Sensing |
Weight | 442 kg |
onboard power | 47 Watts |
Communication | VHF band |
Stabilization | Spin stabilized (spin axis controlled) |
Payload | TVcameras, three band Microwave Radiometer (SAMIR) |
Launch date | Jun 07,1979 |
Launch site | Volgograd Launch Station (presently in Russia) |
Launch vehicle | C-1Intercosmos |
Orbit | 519 x 541 km |
Inclination | 50.6 deg |
Mission life | One year (nominal) |
Orbital Life | About 10 years ( Re-entered in 1989 ) |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Bhaskara-I : ISRO". Archived from the original on 2012-11-20. Retrieved 2015-08-31.
- ↑ "Bharat-rakshak.com Indian satellite systems". Archived from the original on 2007-05-16. Retrieved 2015-08-31.
- ↑ "Bhaskara-I". isro.gov.in. Archived from the original on 2015-04-03. Retrieved 2015-08-31.