భీమ్‌బేట్కా శిలా గుహలు

భారతదేశం మధ్యప్రదేశ్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశం. ౩౦,౦౦౦ ఏళ్ళ నాటి నాగరికత ఆనవాళ్ళు ఉన్న గుహలు
(భీంబేట్కా శిలాఆశ్రయాలు నుండి దారిమార్పు చెందింది)

22°56′14″N 77°36′45″E / 22.93722°N 77.61250°E / 22.93722; 77.61250భీమ్‌బేట్కా శిలా గుహలు ప్రాచీన శిలా యుగం (పేలియోలిథిక్) నాటి పురావస్తు గుహలు. ఈ గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికినీ, దక్షిణ ఆసియాలో రాతి యుగం ఆరంభాన్నీ చాటుతున్నాయి. ఈ గుహలు భారతదేశం లోని మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసేన్ జిల్లా ఒబైదుల్లాగంజ్ పట్టణానికి సమీపంలోని రాతాపానీ వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఇందులో కొన్ని గుహల్లో లక్ష సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆది మానవ జాతికి చెందిన వారు నివసించిన ఆధారాలు దొరికాయి.[1][2] ఈ గుహలలోని కొన్ని రాతి చిత్రాలు 30,000 సంవత్సరాలకు పై బడినవి.[3] ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికి కూడా కనబర్చాయి. 2003లో ఈ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
భీమ్‌బేట్కా శిలా గుహలు
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
భీమ్‌బేట్కా శిలా చిత్రాలు
రకంసాంస్క్రతిక
ఎంపిక ప్రమాణం(iii)(v)
మూలం925
యునెస్కో ప్రాంతందక్షిణ ఆషియా
శిలాశాసన చరిత్ర
శాసనాలు2003 (27th సమావేశం)
భీమ్‌బేట్కా శిలా గుహలు is located in Madhya Pradesh
భీమ్‌బేట్కా శిలా గుహలు
Location of భీమ్‌బేట్కా శిలా గుహలు in India Madhya Pradesh.

భీమ్‌బేట్కా (भीमबेटका) అనే పేరు మహా భారతంలోని భీముడి వలన వచ్చింది.[4] భీమ్‌బేట్కా అనే పదం భీమ్ బైఠకా (भीमबैठका) నుంచి వచ్చింది. దీని అర్థం భీముడు కూర్చున్న ప్రదేశం.[4]

కనుగొనుట

మార్చు

స్థానిక ఆదివాసీల కథనం ప్రకారం 1888 లో పురావస్తు శాఖ పూర్వం ఈ గుహలు బౌద్ధారామాలని నమోదు చేసింది. తరువాత ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేతైన విష్ణు శ్రీధర్ వాకణ్కర్ రైలులో భోపాల్ వెళ్తూ తాను స్పెయిన్, ఫ్రాన్స్ లో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. తరువాత 1957లో వాకణ్కర్ తమ బృందంతో కలసి ఈ గుహలను కనుగొన్నాడు.[5]

మొత్తం 750 గుహలు కనుగొనగా అందులో 243 భీమ్‌బేట్కా వర్గానికి, 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు.

గుహలోని ఏకశిలపై ఉపయోగించిన రంగుల ముడిసరుకును సమీపంలోని బార్ఖేడా ప్రాంతం నుంచి తెచ్చినట్టు గుర్తించారు.[6]

కోతకు గురైన రాతి చిత్రాలు

మార్చు

భీమ్‌బేట్కాలోని ఒక గుహలో చేతిలో త్రిశూలం కలిగి నృత్య భంగిమలో ఉన్న చిత్రం ఉంది. దీనికి డాక్టర్ వాకణ్కర్ నటరాజు అని నామకరణం చేసారు. ఈ గుహల్లోని చిత్రాలు వాతావరణ అవపాతానికి గురై కోంతమేర చెరిగిపోయాయి. వీటిని సంరక్షించడానికి భారత పురావస్తు శాఖ రసాయనాలు, మైనాన్ని ఉపయోగిస్తుంది.[7]

మూలాలు

మార్చు
  1. Javid, Ali and Javeed, Tabassum. World Heritage Monuments and Related Edifices in India. 2008, page 19
  2. http://originsnet.org/bimb1gallery/index.htm
  3. Klaus K. Klostermaier (1989), A survey of Hinduism, SUNY Press, ISBN 0-88706-807-3, ... prehistoric cave paintings at Bhimbetka (ca. 30000 BCE) ...
  4. 4.0 4.1 Mathpal, Yashodhar. Prehistoric Painting Of Bhimbetka. 1984, page 25
  5. "Rock Shelters of Bhimbetka". World Heritage Site. Archived from the original on 8 March 2007. Retrieved 2007-02-15.
  6. "Bhimbetka (India) No. 925" (PDF). UNESCO World Heritage Centre. Retrieved 2012-04-28.
  7. "Natraj painting in Bhimbetka caves said by wakankar". Archived from the original on 2016-10-05. Retrieved 2016-08-25.