విష్ణు శ్రీధర్ వాకణ్కర్

డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్ ( 1919 మే 4 - 1988 ఏప్రిల్ 3) భారతదేశపు పురావస్తు శాస్త్రవేత్త.[1] అతను భోపాల్ సమీపంలోని భీమ్‌బేట్కా శిలా గుహల పురాతన శిలా చిత్రాలను పరిశోధనలు చేసాడు. ఈ చిత్రం 1,75,000 సంవత్సరాల నాటిదని అంచనా వేసాడు. ఈ చిత్రాలు కార్బన్-డేటింగ్ పద్ధతిలో పరీక్షించబడ్డాయి. ఈ పరీక్షల ఫలితంగా ఈ చిత్రాల వయస్సును తెలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో, రైసన్ జిల్లాలో ఉన్న బీమా సిట్కా గుహలలో ఒక వ్యక్తి నివసించేవాడని, అతను చిత్రాలు వేసేవాడని ఈ పరిశోధనలలో తేలింది. 1965 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

Vishnu Shridhar Wakankar
జననం(1919-05-04)1919 మే 4
నీముచ్, మధ్యప్రదేశ్
మరణం1988 ఏప్రిల్ 3(1988-04-03) (వయసు 68)
సింగపూర్
విద్యG. D. (Art), M. A. and Ph. D.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బీమ్‌బెట్కా రాతి గుహల పరిశోధన .
పురస్కారాలు1975లో పద్మశ్రీ

జీవిత విశేషాలు

మార్చు

శ్రీ వాకణ్కర్ మధ్యప్రదేశ్ లోని నీముచ్ లో జన్మించాడు. అతను సంస్కార భారతిలో సభ్యుడు, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. సంస్కృతి, సాహిత్యానికి అంకితమైన అఖిల భారత సంస్థ సంస్కార్ భారతి. దీనిని 1981 లో చిత్రకారుడు బాబా యోగేంద్ర జీ పద్మశ్రీ (2017) స్థాపించాడు.

డాక్టర్ వాకణ్కర్ తన జీవితాంతం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి అంకితం చేశాడు. తన నిరంతర పరిశోధన ద్వారా, భారతదేశంలో గొప్ప ప్రాచీన సంస్కృతి, నాగరికత గురించి ప్రపంచానికి తెలియజేశాడు. " సరస్వతి నది భారతదేశంలో ప్రవహించింది" అని, అలాగే ఈ అదృశ్య నది ప్రవాహ మార్గాన్ని అతను తన అన్వేషణలో ధ్రువీకరించాడు. అతని పరిశోధన ఫలితాలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో చేరిన తరువాత, గిరిజన ప్రాంతాల్లో సామాజిక, విద్యా అభ్యున్నతికి పాటు పడ్డాడు. దాదాపు 50 సంవత్సరాలు అడవుల్లో నడుస్తూ, వారు వివిధ రకాల పెయింట్ చేసిన వేలాది రాక్ షెల్టర్లను అన్వేషించాడు. వాటి నకళ్ళు తయారు చేసి, భారతదేశం, విదేశాలలో ఈ విషయం గురించి వివరంగా వ్రాసాడు. అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటిని ప్రదర్శించాడు. పురాతన భారతీయ చరిత్ర, పురావస్తు రంగంలో, డాక్టర్ వాకణ్కర్ తన బహుముఖ సహకారంతో అనేక కొత్త మార్గాలను తెలియజేశాడు.

సంస్కార్ భారతి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని, ఈ గొప్ప కళాకారుడు, పురావస్తు శాస్త్రవేత్త, పరిశోధకుడు, చరిత్రకారుడు, పుట్టిన శతాబ్ది సంవత్సరాన్ని జన్మ సంవత్సరంగా 2019 మే 4 నుండి 2020 మే 3 వరకు జరుపుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది ఈ ప్రపంచ కళ-అన్వేషకుడికి నిజమైన నివాళి అవుతుంది.

వాకణ్కర్ శోధ్ సంస్థాన్ కార్యక్రమాలు

మార్చు
 
పద్మశ్రీ పురస్కారం

శిలా కళలు

మార్చు

భారతదేశంలోని రాక్ ఆర్ట్ స్కూల్ "పితామహుడు" డాక్టర్ వి.ఎస్. వాకణ్కర్ 1954 నుండి భారతదేశంలో, విదేశాలలో రాక్ ఆర్ట్ పై విస్తృతమైన కృషి చేశారు. దీనికి సంబంధించి, యుకె, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, గ్రీస్, మెక్సికో, ఈజిప్ట్, యు.ఎస్ఎ లలో రాక్ ఆర్ట్స్ అభ్యసించాడు.

అతని సహోద్యోగ్యులు డా. సురేంద్రకుమార్ ఆర్య, డా. దల్జిత్ కౌర్, డా. గిరీష్ చంద్ర శర్మ, డా. నారాయణ్ వ్యాస్, డా. గిరిరాజ్, మిస్టర్. కైలాష్ పాండే, మిస్టర్. పంచోలిజీ, డా. జితేంద్రదత్త త్రిపాఠి, డా. భారతి శ్రోత్రి, డా. దుబే అలాగే మిస్టర్. యు. ఎన్. మిశ్రా, మిస్టర్. లోథర్ బాంకే, మిస్టర్. ఇర్విన్ మేయర్, మిస్టర్. రాబర్ట్ బ్రూక్స్ లతో కలసి డాక్టర్ వి. ఎస్. వాకణ్కర్, రాక్ ఆర్ట్స్ రంగంలో విస్తృతమైన పరిశోధనలు చేశాడు.

డాక్టర్ వాకణ్కర్ భారతదేశంలో 4000 కి పైగా రాక్ గుహలను కనుగొన్నాడు. వాటిపై అధ్యయనం చేశాడు. ఐరోపా, అమెరికాలో రాక్ షెల్టర్ పెయింటింగ్స్‌ను కూడా కనుగొన్నాడు, భారతీయ కళాకారుల కార్యకలాపాల డేటింగ్ 40,000 సంవత్సరాల క్రితం నాటిది.

ఈ రోజు "వాకంకర్ షోధ్ సంస్థాన్" సుమారు 7500 స్కెచ్ల రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ప్రైవేట్ సేకరణను కలిగి ఉంది. వాకణ్కర్ స్వయంగా 4000 కనుగొన్నాడు.

పురావస్తు సర్వేలు

మార్చు

1954 నుండి, డా. వకాంకర్ తన సహచరులు సచిదానంద నాగ్‌దేవ్, ముజాఫర్ ఖురేషి, రహీమ్ గుత్తివాలాలతీ కలసి చంబల్, నర్మదా నదుల లోయలను అన్వేషించి, మహేశ్వర్ (1954), నవదా తోలి (1955), మనోతి (1960), అవారా (1960), ఇంద్రగఢ్ (1959), కయాత (1966), మాండ్‌సౌర్ (1974, 1976), ఆజాద్‌నగర్ (1974), దంగావాడ (1974, 1982), ఇంగ్లాండ్‌లోని వెర్కోనియం రోమన్ సైట్ (1961), ఫ్రాన్స్‌లో ఇన్‌కోలీవ్ (1962), రునిజా (1980), మొదలైన ప్రాంతాలలో ) వద్ద తవ్వకాలు జరిపారు.

ముద్రాశాస్త్రం, ప్రాచీనలిపిశాస్త్రం

మార్చు

ముద్రాశాస్త్రం, ప్రాచీనలిపిశాస్త్రం రంగంలో నిపుణుడు డా. వాకణ్కర్ క్రీ.పూ 5 వ శతాబ్దం నుండి 5500 నాణేలను సేకరించి అధ్యయనం చేశాడు. ఇవి నేడు "వాకంకర్ షోధ్ సంస్థ" కు గర్వకారణం.

డాక్టర్ జగన్నాథ్ దుబే, డా. మురళి రెడ్డి, నారాయణ్ భాటిజీ ఈ కఠినమైన పరిశోధనకు ఎంతో కృషి చేశారు. ఇది కాకుండా, అతను ఉజ్జయిని వద్ద 15000 కంటే ఎక్కువ నాణేలను అధ్యయనం చేశాడు.

అదేవిధంగా, 2 వ శతాబ్దం B. C. నుండి సంస్కృత, ప్రాకృత, బ్రాహ్మి భాషలలోని 250 శాసనాల సమాహారం సేకరణ "వాకంకర్ షోధ్ సంస్థ" ప్రతిష్ఠను సుసంపన్నం చేస్తుంది.

ముగింపు

మార్చు

అతను పురాతన పురావస్తు శాస్త్రం, ప్రాచీన భారతీయ చరిత్రలో తన పరిశోధనను కొనసాగించాడు. ఇప్పుడు ఎండిపోయిన సరస్వతి నది బేసిన్ ను కనిపెట్టడానికి అతను బాధ్యత వహించాడు. ఇది భారత నాగరికతలో చాలా వరకు రహస్యాలను కలిగి ఉంది. అతను స్థాపించిన సంస్థలు ఈ రోజు సజీవంగా ఉన్నాయి. వాటిని ఉజ్జయినిలో సందర్శించవచ్చు.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-01-09. Retrieved 2020-04-05.
  2. http://www.kamat.com/kalranga/people/pioneers/wakankar.htm

బాహ్య లింకులు

మార్చు