వెదిరె రామచంద్రారెడ్డి

తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త
(భూదాన్ రామచంద్రారెడ్డి నుండి దారిమార్పు చెందింది)

వెదిరె రామచంద్రారెడ్డి (1905, జూలై 13 - 1986, డిసెంబరు 9) తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త.[1] 1951లో దక్షిణ భారతదేశంలో భూదానోద్యమంలో భాగంగా పేదలకు తన భూమిని దానం చేసిన మొట్టమొదటి భూస్వామి.[2][3][4][5]

వెదిరె రామచంద్రారెడ్డి
జననం
వెదిరె రామచంద్రారెడ్డి

(1905-06-13)1905 జూన్ 13
మరణం1986 డిసెంబరు 9(1986-12-09) (వయసు 81)
జాతీయతభారతీయుడు
వృత్తిన్యాయవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భూదాన కార్యకర్త
తల్లిదండ్రులునరసారెడ్డి - లక్ష్మి నరసమ్మ
బంధువులుఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు

జననం, విద్య

మార్చు

రామచంద్రారెడ్డి 1905, జూలై 13న నరసారెడ్డి - లక్ష్మి నరసమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లిలో జన్మించాడు. వీరిది భూస్వామ్య కుటుంబం. తొమ్మిది మంది సంతానం ముగ్గురు ఆడపిల్లలు (మాణిక్యదేవి, విమలాదేవి, సీతాదేవి), ఆరుగురు మగపిల్లలు (రామచంద్రారెడ్డి, రాణాప్రతాప్ రెడ్డి, లక్ష్మణరెడ్డి, మన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నారాయణ్ కరణ్ రెడ్డి). 1935 - 1938 మధ్యకాలంలో పూణేలోని ఫెర్గూసన్ లా కాలేజీలో తన లా/బారిస్టర్ శిక్షణ పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రామచంద్రా రెడ్డికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. కొన్ని సంవత్సరాలు న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆ తరువాత రాజీనామా చేసి, సంఘ సంస్కరణలో భాగమయ్యాడు.

భూదానోద్యమం

మార్చు

తెలంగాణ సాయుధ పోరాటానికి అధ్యక్షత వహించిన రావి నారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరూ బావా -బావమరుదులు. రామచంద్రారెడ్డి చెల్లెలు సీతాదేవిని రావి నారాయణరెడ్డి వివాహం చేసుకున్నాడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో ఆచార్య వినోభా భావే 1951 ఏప్రిల్ 18 న పోచంపల్లి గ్రామానికి వచ్చి, అక్కడ భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. వినోభా భావే మొదటి ప్రయత్నంగా రామచంద్రారెడ్డిని కలిసి భూమిని దానం చేయమని అభ్యర్థించగా, ఆయన వెంటనే స్పందించి తన తండ్రి నరసారెడ్డి జ్ఞాపకార్థం వందెకరాల భూమిని దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చాడు. మొదటగా 100 ఎకరం (400,000 మీ2) భూమిని పంచాడు.[6] తరువాత 800 ఎకరం (3.2 కి.మీ2) చివరికి, 1 మిలియన్ ఎకరాలు (4,000 కిమీ²) భూమిని పంచాడు. భూదాన ఉద్యమంలో మొట్టమొదటగా తన భూమిని దానం చేసినందుకు భూదాన్ అనే బిరుదును అందుకున్నాడు. దీని తర్వాత భూదాన ఉద్యమం రామచంద్రారెడ్డి కుమారుల ఆధ్వర్యంలో కొనసాగింది.

రామచంద్రారెడ్డి 1986, డిసెంబరు 9న మరణించాడు.

గౌరవం

మార్చు
  • 2006లో పోచంపల్లి గ్రామ మధ్యలో రామచంద్రారెడ్డి విగ్రహం ప్రతిష్టించబడింది.
  • భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన వెదిరె రామచంద్రారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది.[7]
  • రామచంద్రారెడ్డి సేవలను గుర్తించి ఆతని స్మారకార్థం పోస్టల్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ 2022 జూలై 17న సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పి. విద్యాసాగర్‌రెడ్డి విడుదల చేశాడు.[8]

మూలాలు

మార్చు
  1. Adivi, Sashidhar (2021-08-14). "Remembering the man behind Bhoodan Movement: Vedire Ramachandra Reddy". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-18. Retrieved 2022-08-23.
  2. Oommen, T. K.. "Charisma, Social Structure and Social Change*".
  3. Sharma, B. A. V. (1980). Political economy of India: a study of land reforms policy in Andhra Pradesh. Light & Life Publishers. p. 270. OCLC 7153593.
  4. Narayanasamy, S. (2003). The Sarvodaya movement: Gandhian approach to peace and non-violence. Mittal Publications. p. 33.
  5. Bharathi, K. S. (1998). Encyclopaedia of Eminent Thinkers: The political thought of Vinoba. Concept Publishing. p. 16.
  6. "The Hindu : Andhra Pradesh / Hyderabad News : 'Bhoodan' board to take on encroachers". 2009-11-25. Archived from the original on 2009-11-25. Retrieved 2021-06-30.
  7. Adivi, Sashidhar (2021-07-31). "A biopic on Vedire Ramachandra Reddy". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-03. Retrieved 2022-08-23.
  8. "రేపు వెదిరె రామచంద్రారెడ్డి స్మారక పోస్టల్‌ కవర్‌ విడుదల". www.andhrajyothy.com. 2022-07-15. Archived from the original on 2022-08-23. Retrieved 2022-12-09.

బయటి లింకులు

మార్చు