భూపతిరాజు సీతారామరాజు

న్యాయవాది, పత్రికా సంపాదకులు. ప్రజాసేవకులు

భూపతిరాజు సీతారామరాజు న్యాయవాది, పత్రికా సంపాదకులు. ప్రజాసేవా కార్యక్రమాలతో సంబంధం ఉండేది. సీతారామరాజు విశాఖ జిల్లా అలమండ లో 1891 లో జన్మించారు.

భూపతిరాజు సీతారామరాజు

ఇతను సెకండరీ విద్య, బి.ఏ. కూడా విశాఖపట్టణం ఏ.వి.ఎన్. కళాశాలలో చదివారు. తరువాత లండన్ లో , డబ్లిన్ (ఐర్లాండ్) లలో బారిస్టర్ చదివారు.

లండన్ లోనే లాలా లజపతి రాయ్ పరిచయం, సాహచర్యం లభించింది. లాలా లజపతి రాయ్ ఇతనికి రాజకీయ గురువు. జిన్నా సాహెబ్ అధ్యక్షతన ఏర్పడ్డ నేషనలిస్ట్ పార్టీకి చీఫ్ విప్ గా పనిచేసారు. అనేక ప్రజా హిత కార్యక్రమాలలో పాల్గొన్నారు.

"రాజకీయాభివృద్ధిని" అను మాసపత్రికకు సంపాదకులుగా ఉన్నారు. 10.8.1933 నుండి 19.1.1934 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు.[1]

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ సారధులు - గ్రంథాలయ సంఘ అధ్యక్షులు". గ్రంథాలయ సర్వస్వం. 85 (1): 39–44. April 2024.