భోపాల్ - బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్

భోపాల్ బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్/ప్యాసింజర్ లేదా ‘బిలాస్ పూర్’ ఎక్స్ ప్రెస్ రైలు అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలోని భోపాల్ జంక్షన్, బిలాస్ పూర్ మధ్య నడిచే రైలు.[1] మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బిలాస్ పూర్ ఉంటుంది. భోపాల్ _ బిలాస్ పూర్ రైలు మొత్తం రెండు వైపులా కలిపి 720 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Bhopal – Bilaspur Express speeding 73 km/h between Bina Junction and Khurai Railway Station

రైలు నెంబర్లు, పేర్లు

మార్చు

భోపాల్ నుంచి బిలాస్ పూర్, ఛత్తీస్ గఢ్ వరకు నడిచే రైలు 18235 నెంబర్ తో నడుస్తుండగా, బిలాస్ పూర్, ఛత్తీస్ గఢ్ నుంచి భోపాల్ వరకు నడిచే రైలు 18236 నెంబరుతో నడుస్తుంది. సాధారణంగా ఇరువైపులా నడిచే ఈ రైలు పేరును బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ గానే సంబోధిస్తారు. గమ్యం, ఆరంభాలను గుర్తించే విధంగా ఈ రైలుకు ఆ పేరు పెట్టడం జరిగింది.

రాకపోకల సమాచారం

మార్చు

ఈ రైలు ప్రతిరోజు భోపాల్ నుంచి బిలాస్ పూర్, బిలాస్ పూర్ నుంచి భోపాల్ వరకు రెండు వైపుల నడుస్తుంటుంది. 18235 నెంబరు గల రైలు ప్రతిరోజు ఉదయం 8:00 గంటలకు భోపాల్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణం లో 18236 నెంబరు తో పిలిచే ఈ రైలు భోపాల్ లోని భోపాల్ నిష్టాపురా రైల్వే స్టేషను కు సాయంత్రం 17:30 గంటలకు చేరుకుంటుంది.[2][3]

మార్గం, ఆగు స్థలాలు

మార్చు
 
(Bhopal - Bilaspur) Express Route map

ఈ రైలు బినా –కత్నీ రైలు మార్గంలో నడుస్తూ, మొత్తం 63 స్టేషనులలో ఆగుతుంది. ఈ మార్గంలోని పట్టణ ప్రాంత, సబ్ అర్బన్ ప్రాంత స్టేషనులలోనూ ఆగుతుంది. వీటితో పాటు ఈ రైలు ఈ క్రింది ప్రధాన స్టేషనుల లో ఆగుతుంది. వాటి వివరాలు:[4][5][6]

4

బోగీల రకాలు

మార్చు

భోపాల్ _ బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఏయిర్ కండీషన్ బోగీలు ఉండవు. కేవలం సాధారణ ప్రయాణీకులకోసం నడిచే ప్రత్యేక రైలు ఇది.

సాధారణ వేగము, ఫ్రీక్వెన్సీ

మార్చు

భోపాల్ – బిలాస్ పూర్ మధ్య నడిచే 18235 నెంబరు గల రైలు సగటున గంటకు 54 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భోపాల్ జంక్షన్ నుంచి మొదలు కొని కురాయ్ రైల్వే స్టేషనుల చేరేవరకు లెక్కించిన సగటు వేగమిది. మళ్లీ కురాయ్ సుమ్రేరీ(ఇది కురాయ్ యొక్క సబర్బన్ రైల్వేస్టేషను) నుంచి బిలాస్ పూర్, ఛత్తీస్ గఢ్ వరకు ఈ రైలు సగటు వేగం కొంత తగ్గుతుంది. ఈ సమయంలో గంటకు 40 కిలో మీటర్ల చొప్పున ప్రయాణిస్తుంది.

అదేవిధంగా బిలాస్ పూర్ – భోపాల్ మధ్య నడిచే 18236 నెంబరు గల రైలు పూర్తిగా ప్యాసింజర్ రైలు లాగా నడుస్తుంది. ఇక్కడి నుంచి భోపాల్ చేరుకునే వరకు సగటున గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రతీ ఒక్క స్టేషనులోనూ ఆగుతుంది.[7] ఇరుమార్గాల్లో నడిచే ఈ రైలు మొత్తం రెండు వైపులా కలిపి 720 కిలో మీటర్ల దూరాన్ని 23 గంటల వ్యవధిలో ప్రయాణిస్తుంది.

స్లిప్ సర్వీస్(లింక్ ఎక్స్ ప్రెస్)

మార్చు

18229/18230 భోపాల్ _ కెరిమెరి ప్యాసింజర్

భోపాల్ నుంచి బిలాస్ పూర్ మధ్య నడిచే ఇతర రైళ్లు

మార్చు
  • నర్మదా ఎక్స్ ప్రెస్
  • అమర్ కంఠక్ ఎక్స్ ప్రెస్
  • గోండ్వానా ఎక్స్ ప్రెస్
  • ఛగ్గీత్ సారా ఎక్స్ ప్రెస్

బయటి లింకులు

మార్చు

సూచనలు

మార్చు
  1. "Bhopal". Bhopal.com.
  2. "Welcome to Indian Railway Passenger reservation Enquiry". Indianrail.gov.in. Retrieved 2013-05-18.
  3. "Bhopal Express". Indiarailinfo.com. Archived from the original on 2016-05-18. Retrieved 2014-12-16.
  4. "Bhopal Bilaspur Express". Cleartrip.com. Archived from the original on 2013-12-30. Retrieved 2014-12-16.
  5. "Bilaspur to Bhopal Express Passenger Timetable" (PDF). Indianrailways.gov.in.
  6. "Runningstatus-18236". Railenquiry.in. Archived from the original on 2016-03-04. Retrieved 2014-12-16.
  7. "Bilaspur To Bhopal Express".