భౌతికవాదం
భౌతికవాదం అంటే భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించే అలోచించడం. చెట్లు, కొండలు, కోనలు, మనిషి, సమాజం ఇవన్నీ భౌతికంగా ఉనికిలో ఉన్నవే. ప్రకృతికి అతీతమైన ఊహాజనిత వస్తువులని (దేవుడు, ఆత్మ లాంటివి) నమ్మడం భావవాదం కిందకి వస్తుంది. గుడ్డుని వేడి ప్రదేశంలో ఉంచితే గుడ్డు నుంచి పిల్ల వస్తుంది కానీ రాయిని వేడి చేస్తే రాయి నుంచి పిల్ల రాదు. ఎందుకంటే గుడ్డు యొక్క భౌతిక పునాదులు వేరు, రాయి యొక్క భౌతిక పునాదులు వేరు అని అన్నాడు మావో జెడాంగ్. పదార్థం యొక్క భౌతిక పునాదులకి వ్యతిరేకంగా ఏదీ జరగదని భౌతికవాదులు సూత్రీకరించారు.
గతితార్కిక భౌతికవాదం
మార్చుగతితర్కం అంటే ప్రతి వస్తువు\విషయం యొక్క synthesis (నిర్మాణ ప్రక్రియ లేదా పరిణామ ప్రక్రియ), antithesis (విఛ్ఛిన్న ప్రక్రియ) ని అర్థం చేసుకోవడం. గ్రీక్ భాషలో డయలెగో అంటే వాదన-ప్రతివాదన అని అర్థం. దాన్ని ఆంగ్లంలో dialectic అని, తెలుగులో గతితర్కం అని అనువదించడం జరిగింది. హెగెల్ ప్రభావిత మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదం ప్రకారం ప్రతి పదార్థానికి చలనం (motion) ఉంటుంది. గతితార్కిక భౌతికవాదం అంటే భౌతికవాదాన్ని గతితార్కిక పద్ధతిలో అర్థం చేసుకోవడం.
జడతత్వ భౌతికవాదం
మార్చుజడతత్వ భౌతికవాదం (metaphysical materialism) వస్తువుని లేదా విషయాన్ని దాని పరిసరాలతో వేరు చేసినట్టు చూస్తుంది. ఉదాహరణకు జడతత్వవాదుల దృష్ఠిలో మనిషి వేరు సమాజం వేరు. లుడ్విగ్ ఫోయెర్బాఖ్ కూడా గొప్ప నాస్తికుడే. మనిషిని దేవుడు సృష్ఠించలేదు, మనిషి ప్రాకృతిక జీవపరిణామం వల్ల అవతరించాడు అని ఫోయెర్బాఖ్ కూడా అంగీకరించాడు కానీ మనిషికి సమాజానికి ఉన్న సంబంధం గురించి మాత్రం అంగీకరించ లేదు. మనిషి సామాజిక జీవి, మనిషి సమాజం నుంచి వేరు పడలేడని కారల్ మార్క్స్ వాదించాడు. భూమి సూర్యుని గ్రావిటేషన్ శక్తి వల్ల సూర్యుని చుట్టు తిరుగుతోంది. భూమి స్వతంత్రంగా సూర్యుని చుట్టు తిరుగుతోంది అన్నట్టు ఉంటాయి జడతత్వవేత్తల అలోచనలు.
మధ్యయుగపు భౌతికవాదులు
మార్చుమధ్యయుగంలో అనేక మంది ప్రగతి నిరోధక తత్వవేత్తలు భావవాదాన్ని సమర్థించే వాళ్ళు. వీరు భూస్వామ్య రాచరిక ప్రభువులకి అనుకూలంగా ఉంటూ ప్రజలలో ఆలోచన శక్తి ఎదుగుదలని నిరోధించడానికి ప్రయత్నించే వారు. మనిషి తన గురించి ఏమీ తెలుసుకోలేడు, భావం (idea), ఆత్మ (soul) లాంటివి మాత్రమే తెలుసుకోగలడు అని అర్థం వచ్చేలా సూత్రీకరణలు చేసేవారు కానీ వీరి వాదనతో కొంత మంది తత్వవేత్తలు అంగీకరించలేదు. ఈ తత్వవేత్తలు భౌతిక పదార్థాలే నిజాలని నమ్మేవారు. కానీ వీరు గతితార్కిక భౌతికవాదులు కారు. వీరు జడతత్వ భౌతికవాదాన్ని నమ్మేవారు. పదార్థం యొక్క భౌతిక పునాదులకి విరుద్ధంగా ఏదీ జరగదని భౌతికవాదులందరికీ తెలుసు కానీ జడతత్వ భౌతికవాదులు పదార్థం యొక్క synthesis (నిర్మాణ ప్రక్రియ లేదా పరిణామ ప్రక్రియ), antithesis (విఛ్ఛిన్న ప్రక్రియ), చలన సూత్రాలని సమగ్రంగా అర్థం చేసుకోరు. జడతత్వ భౌతికవాదుల సూత్రీకరణలు తప్పని హెగెల్ తత్వశాస్త్రం నిరూపించింది కానీ అంతకు ముందు మూఢ నమ్మకాలని ఎదిరించడంలో జడతత్వ భౌతికవాదులే పాత్రలు పోషించారు.
ప్రాచీన స్వత:సిద్ధ భౌతికవాదులు
మార్చుఆ కాలంలో మనిషి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువైనా కొంత మంది భారతీయ, గ్రీక్ తత్వవేత్తలు భౌతికవాదాన్నే నమ్మే వారు. చార్వాకుల సిధ్ధాంతం ప్రకారం మూల పదార్థాలు నాలుగు (నేల, నీరు, గాలి, నిప్పు). వీటి సంయోగం వల్లే పదార్థ పరిణామం జరుగుతుంది. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు.