2500 సంవత్సరాల క్రితం మనుషులకి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుళ్ళో కూడా భారత దేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులని చార్వాకులు లేదా లోకాయతులని అనే వారు. లోకాయతులు అంటే ఉన్న లోకాన్నే నమ్మేవారు. వీరు పరలోకాన్ని నమ్మరు. చార్వాకుల సిధ్ధాంతం ప్రకారం మూల పదార్థాలు నాలుగు (నేల, నీరు, గాలి, నిప్పు). వీటి సంయోగం వల్లే పదార్థ పరిణామం జరుగుతుంది. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

భారతీయ తత్వశాస్త్రం - ఏటుకూరి బలరామమూర్తి, పబ్లిషర్: విశాలాంధ్ర బుక్ హౌస్