భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం

భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం, పెదకాకాని గుంటూరు జిల్లా పెదకాకానిలో ఈ దేవాలయం ఉంది.

భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం
భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం
భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
పేరు
ప్రధాన పేరు :భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు
ప్రదేశం:పెదకాకాని
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం

స్థల పురాణం మార్చు

ఈ దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉంది. ఈ లింగం శ్రీశైలం లింగాంశం కలిగి ఉండటంతో ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమ ఇందులోనూ ఉన్నట్లే మహార్షలోని అత్యంత ప్రసిద్ధి చెందిన భరద్వాజ మహాముని ఒకప్పుడు అన్ని తీర్థాలూ సేవిస్తూ భూప్రదక్షిణలు చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చాడు. స్వామిని అభిషేకిస్తున్న సమయంలో శివానుగ్రహం వలన యజ్ఞ సంకల్పం కలిగింది మహర్షికి. సమస్త సంభారాలను సమకూర్చి, ఎందరో మహర్షుల నాహ్వానించి, యజ్ఞాన్ని ప్రారంభించారు. దేవతలకు ఆహుతులను అందించే సమయంలో ఒక కాకి వచ్చి వాటిని తిన సాగింది.యజ్ఞం అపవిత్ర మౌతోందని దానిని వారించబోయాడు. కాని ఆ కాకి మనుష్య భాష లో” తాను కాకాసురుడనే రాక్షసుడినని, బ్రహ్మదేవుని వరం వలన తనకు హవిర్భాగాలను స్వీకరించే అర్హత దక్కిందని, నీ యజ్ఞం సఫలం కావాలంటే యజ్ఞజలంతో నన్ను అభిషేకించు. నా కున్నశాపము తీరుతుంది. నీ యజ్ఞము సుసంపన్నమౌతుందని చెప్పింది.ఆ మాటలు విన్న భరద్వాజమహర్షి యజ్ఞాన్ని పూర్తి చేసి, అభిషేకజలాన్ని ఆ కాకి పై చల్లగానే ఆ కాకి తన నల్లని రూపాన్ని వదిలి శ్వేతవర్ణాన్ని పొంది, మహర్షిని స్తుతించి, శ్రీమల్లేశ్వరుని మల్లికా కుసుమాలతో పూజించి, మానస సరోవర తీరం లోని, మహా అశ్వత్థ వృక్షపు తొర్రలో గల తన నివాసానికి చేరుకుంది. ఆ పక్షిరాజు మానస సరోవరం నుండి ఆకాశమార్గం లో దక్షిణ భారతదేశ లోని చెంగల్పట్టు వద్ద గల పక్షితీర్థానికి వెళ్లి, సర్వేశ్వరుని దర్శించి, బలిని స్వీకరించి, తిరిగి వెళుతూ, శ్రీ కాకాని మల్లేశ్వరుని దర్శించుకొని వెళుతూ ఉంటుందని స్థలపురాణం వివరించారు.

ఉత్సవాలు మార్చు

ప్రతి సంవత్సరాది పండుగ రోజున శ్రీ స్వామి వారి పేరిట పంచాగాన్ని ప్రకటించి, శ్రీ స్వామి సమక్షంలో పంచాంగ శ్రవణం జరిపి, వచ్చిన భక్తులకు ఉచితంగా దేవస్థానం వారు పంచాగాలను పంచి పెడతారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలు. ఆశ్వయుజ మాసంలో శ్రీదేవీ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరంమాఘ బహుళ ఏకాదశి నుండి ఫాల్గుణశుక్ల పాడ్యమి వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

రవాణా సౌకర్యం మార్చు

రవాణా సౌకర్యం కలదు గుంటూరుకు దగ్గరలో గల పెదకాకాని గ్రామంలో ఈ శివాలయం ఉంది. గుంటూరు నుండి విజయవాడ రహదారిలో ఉంది. గుంటూరు లేక విజయవాడ నుండి బస్సులలో వెళ్ళవచ్చు.[1]

మూలాలు మార్చు

  1. "Peda Kakakani Sivalayam / పెదకాకాని శివాలయం". www.telugukiranam.com. Archived from the original on 2020-02-29. Retrieved 2020-02-29.