మంగి యువరాజు

సా.శ. 682 - 706 మధ్య వేంగిని పాలించిన తూర్పు చాళుక్య వంశపు రాజు

మంగి యువరాజు, తూర్పు చాళుక్య వంశపు రాజు. తండ్రి రెండవ విష్ణువర్ధనుడి తరువాత అతను వేంగి సామ్రాజ్యాన్ని సా.శ. 682 నుండి 706 వరకు 25 సంవత్సరాల పాటు పాలించాడు. అతని పెదతాత మొదటి జయసింహుడు అతన్ని యువరాజుగా ప్రకటించాడు. అయితే యువరాజు అనే పదవి అతని పేరులో కలిసిపోయి, అతను రాజైన తరువాత కూడా అలాగే ఉండిపోయింది. విశాఖపట్నం నుండి ఒంగోలు వరకు ఉన్న తీర ప్రాంతమంతా అతని పాలనలో ఉండేది.[1]

మంగి యువరాజుకు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. వారి ద్వారా అతనికి కొక్కిలి విక్రమాదిత్య, రెండవ జయసింహుడు, మూడవ విష్ణువర్ధనుడు అనే ముగ్గురు కుమారులు పృథ్వి పోరి అనే ఒక కుమార్తె ఉన్నారు. [2]

మంగి యువరాజు మరణం తరువాత అతని ముగ్గురు కుమారులు ఒకరి తరువాత ఒకరు రాజ్యానికి వచ్చారు. ముందుగా రెండవ జయసింహుడు రాజయ్యాడు.

అంతకు ముందువారు
రెండవ విష్ణువర్ధనుడు
తూర్పు చాళుక్యులు
సా.శ. 682 – 706
తరువాత వారు
రెండవ జయసింహుడు

మూలాలు మార్చు

  1. నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 69.{{cite book}}: CS1 maint: date and year (link)
  2. "తూర్పు చాళుక్యులు". ఈనాడు ప్రతిభ. Archived from the original on 2024-04-17. Retrieved 2024-04-17.