రెండవ విష్ణువర్ధనుడు

సా.శ. 673 - 682 మధ్య వేంగిని పాలించిన తూర్పు చాళుక్య వంశపు రాజు

రెండవ విష్ణువర్ధనుడు (సా.శ. 673 - 682) తూర్పు చాళుక్య వంశంలో నాలుగవ రాజు. అతని తండ్రి ఇంద్ర భట్టారకుడు ఏడు రోజులు మాత్రమే పాలించాడు. అతని తరువాత రెండవ విష్ణువర్థనుడు తూర్పు చాళుక్య రాజు అయ్యాడు. అతను లోకాశ్రయుడు, విషమసిద్ధి, మకరధ్వజుడు, ప్రళయాదిత్యుడు అనే బిరుదులు దాల్చాడు.[1] సా.శ. 673 నుండి సా.శ. 682 వరకు 9 సంవత్సరాలు పాలించాడు.

అతని తరువాత అతని కుమారుడు మంగి యువరాజు పాలనకు వచ్చాడు.

అంతకు ముందువారు
ఇంద్ర భట్టారకుడు
తూర్పు చాళుక్యులు
673 – 682
తరువాత వారు
మంగి యువరాజు

మూలాలు

మార్చు
  1. నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 68.{{cite book}}: CS1 maint: date and year (link)

మరింత చదివేందుకు

మార్చు
  • దుర్గాప్రసాద్, క్రీ.శ.1565 వరకు ఆంధ్రుల చరిత్ర, పి.జి.పబ్లిషర్స్, గుంటూరు (1988)
  • నీలకంఠ శాస్త్రి, KA (1955). ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, OUP, న్యూఢిల్లీ (పునర్ముద్రితం 2002).