మండిపల్లి నారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

మండిపల్లి నారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

మండిపల్లి నారాయణరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1993 - 2004
ముందు మండిపల్లి నాగిరెడ్డి
తరువాత సుగవాసి పాలకొండ్రాయుడు
నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955 జులై 1
పడమటికోన గ్రామం చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2019 జనవరి 11
చెన్నై
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జయరామిరెడ్డి, మల్లమ్మ
సంతానం రాహుల్‌రెడ్డి, సద్గుణ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

మండిపల్లి నారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, చిన్నమండెం మండలం, పడమటికోన గ్రామంలో జయరామిరెడ్డి, మల్లమ్మ దంపతులకు 1955 జులై 1న జన్మించాడు. ఆయన బీకాం వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

మండిపల్లి నారాయణరెడ్డి తన పినతండ్ర మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి 1993లో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడంతో ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 1993లో రాయచోటి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోపోటీ చేసి గెలిచి రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు. నారాయణరెడ్డి 1999 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయనకు 2004లో జరిగిన ఎన్నికల్లో టికెట్టు లభించకపోడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

మండిపల్లి నారాయణరెడ్డి శ్వాసకోస, గుండెనొప్పి సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందుకుంటూ ఆరోగ్యం విషమించడంతో 2019 జనవరి 11న మరణించాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (11 January 2019). "మాజీ ఎమ్మెల్యే మండిపల్లి కన్నుమూత". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  2. Sakshi (11 January 2019). "మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూత". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.