మంత్రవాది
మంత్రవాది 1959 జూన్ 19 న
మంత్రవాది (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సుబ్రమణ్యం |
---|---|
కథ | నాగవల్లి ఆర్.ఎస్.కురుప్ |
చిత్రానువాదం | అనిసెట్టి |
తారాగణం | ప్రేమ్ నజీర్, మిస్ కుమారి |
నేపథ్య గానం | ఎ.ఎం.రాజా, పి.సుశీల, పి.కె.సరస్వతి, కె.సుందరమ్మ, రాజరాజేశ్వరి, విజయలక్ష్మి, పురుషోత్తం |
నిర్మాణ సంస్థ | నీలా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మిస్ కుమారి - మల్లిక
- ప్రేమ్ నజీర్ - ప్రియకుమార్
- టి.ఎస్.ముత్తయ్నీలా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి. దర్శకుడు సుబ్రహ్మణ్యం. ఈ చిత్రంలో ప్రేమ్ నజీర్, కుమారి, పంకజo , ముత్తయ్య ముఖ్య పాత్రలు పోషించారు. కధ ఆర్. ఎస్ కురూప్ సమకూర్చారు. చిత్రానువాధం అనిశెట్టి సుబ్బారావు చేసారు.య - సుగుణుడు,వినయుడు (ద్విపాత్రాభినయం)
- శ్రీధరన్ నాయర్ - మంత్రవాది
- ఎస్.పి.పిళ్ళై - మాయదాసరి
- అడూర్ పంకజం - మాయావతి
- సోమన్ - వీరవర్మ
- జోస్ ప్రకాష్ - ప్రభాకరవర్మ
- తంగం - కళ్యాణి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: పి.సుబ్రమణ్యం
- కథ: నాగవల్లి ఆర్.ఎస్.కురుప్
- పాటలు, మాటలు:అనిసెట్టి
- డబ్బింగ్ పర్యవేక్షణ: కె.జె.మోహన్
- నిర్మాణం: మెర్రిలాండ్ స్టూడియోస్
కథా సంగ్రహం
మార్చుమహారాజు ప్రభాకరవర్మ తన కుమారుడు ప్రియకుమార్ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సమయంలో అతని మిత్రుడు వీరవర్మ మహారాజు వచ్చి అతడిని దీవించి ఒక ఖడ్గాన్ని బహూకరిస్తాడు. యుక్తవయసు వచ్చాక ప్రియకుమార్‌కు వీరవర్మ కూతురు మల్లికను ఇచ్చి పెళ్ళి చేయాలని మిత్రులిద్దరూ నిశ్చయించుకుంటారు. ప్రజలతో జరిగిన పోరాటంలో ప్రభాకరవర్మ, అతని అనుచరుడు సుగుణుడు మరణిస్తారు. మహారాణి సుశీలాదేవి ప్రియకుమార్‌ను, సుగుణుడి కుమారుడైన వినయ్‌ను తీసుకుని అడవిలో తలదాచుకుంటుంది. ఒకనాడు వీరవర్మ భార్యాబిడ్డలతో ప్రయాణిస్తుండగా మంత్రవాది, మాయావి ఐన మహేంద్రుడు తన అనుచరులను వారి మీదకు పురుకొలిపి తాను వారిని రక్షించినట్లు నాటకమాడతాడు. తాను కోరిన బహుమానం ఇస్తానని వీరవర్మచే వాగ్దానం పొంది మల్లిక పెరిగి పెద్దదైన వెంటనే తనకు అప్పగించాలని కోరుతాడు. గత్యంతరం లేక వీరవర్మ అంగీకరిస్తాడు. కొంతకాలానికి మల్లిక యవ్వనవతి అవుతుంది. అడవిలో ప్రియకుమార్, వినయ్‌లు పెరిగి పెద్దవారై సకల విద్యలలోను రాణిస్తారు. ప్రియకుమార్, మల్లిక అనుకోకుండా అడవిలో కలుసుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తరువాత ప్రియకుమార్ పాములవాని వేషంలో రాజమందిరంలోకి వెళ్ళగా వీరవర్మ అతడిని బంధిస్తాడు. అతని వద్ద ఉన్న ఖడ్గాన్ని చూచి అతడు ప్రియకుమార్‌గా గుర్తించి మల్లికను ఇచ్చి వివాహం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. మంత్రవాది మహేంద్రుడు ఈ విషయం తెలుసుకుని పగసాధించడానికి ప్రయత్నిస్తాడు. ప్రియకుమార్‌ను, వినయ్‌ను మంత్రించి మూర్ఛపోయేటట్టు చేసి తన అనుచరులకు వారి రూపాలను ప్రసాదించి మల్లికను వివాహమాడటానికి పంపుతాడు. వివాహం జరిగే సమయానికి సరిగ్గా అసలైన ప్రియకుమార్, వినయ్‌లు అక్కడికి వచ్చి ఆ వేషధారులను తరిమివేస్తారు. దీనితో మహేంద్రుడు మరింత క్రోధుడవుతాడు. ఉద్యానవనంలో విహరిస్తున్న మల్లికను నెమలి రూపంలో ఆకర్షించి ఆమెను పట్టి బంధించి తన మంత్రద్వీపానికి తీసుకుపోయి అక్కడ ఖైదు చేస్తాడు. మల్లికను రక్షించడానికి ప్రియకుమార్, వినయ్‌లు బయలుదేరుతారు. మార్గమధ్యంలో మహేంద్రునిచే అనేక బాధలను అనుభవించిన కళ్యాణి, విపునులనే దంపతులను కలుసుకుని మంత్రవాదిని తుదముట్టించడం కాళికాదేవి చేతిలోని వజ్రఖడ్గం పొందితే తప్ప సాధ్యం కాదని తెలుసుకుని దానిని సంపాదించడానికి పూనుకుంటారు. ఈ పరిస్థితులలో వినయుడు మరణిస్తాడు. ప్రియకుమార్ అనేక కష్టాలను అనుభవించి భయంకర భూతాలను ఎదుర్కొని ఆఖరుకు ఖడ్గాన్ని వశం చేసుకుంటాడు. మల్లిక తన కోరికను అంగీకరించలేదని మహేంద్రుడు ఆమెను 101 కన్యగా కాళికాదేవికి బలియిచ్చి సర్వశక్తి సంపన్నుడు కావాలని నిశ్చయించుకున్నాడు. సమయానికి ప్రియకుమార్ అక్కడికి చేరుకుని మంత్రవాదిని సంహరించాడు. మల్లికకు ప్రియకుమార్‌కు వివాహం మహావైభవంగా జరుగుతుంది.[1]
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను అనిసెట్టి రచించగా పి.సుశీల, ఎ.ఎం.రాజా, పి.కె.సరస్వతి, కె.సుందరమ్మ, రాజరాజేశ్వరి, విజయలక్ష్మి, పురుషోత్తంలు ఆలపించారు.[1]
క్ర.సం | పాట |
---|---|
1 | పూచిన పూవుల అందములే మోహనమూర్తుల చందములే |
2 | కాంచితినో సఖీ కాంచితినో సుందర దేహుని కోమలనేత్రునే కాంచితినో |
3 | అడవిలోన పక్షులల్లె ఆడిపాడుదాం కూడి ఆడిపాడుదాం |
4 | మహా విశ్వనేతా ప్రాణదాతా జననీ నీ భక్తుల గనవా |
5 | కొత్త కొత్త కోరికలూరే చెలిమి ఎంత పావనం |
6 | నాగుపామా ఆటలాడు భామా నీవికనైన తెలియవె నాదు ప్రేమ |
7 | వెలిగే మెరుపల్లే పెరిగే మెరుపులనే మించి |
8 | ఈ వేదనే ఓపలేనే ఈ వేదనే ఓపలేనే జీవమ్మునే వీడనా |
9 | ఎరుగవా ఓ పవనమా నా కాంతుడు ఏమాయెనో |
10 | ఎంత ఎంత కాలం నీకై వేచి ఉన్నాం నేటికిట్లు నీవే మాకై వచ్చావ్ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 అనిసెట్టి (1959). మంత్రవాది పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 22 May 2021.