మందాకిని (నవల)
మందాకిని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలల్లో అత్యదిక ముద్రణలు పొందిన ప్రసిద్ధ నవల.
మందాకిని. | |
మందాకిని. నవల ముఖచిత్రం | |
కృతికర్త: | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నలల |
ప్రచురణ: | సాహితి పబ్లిషింగ్ హౌస్,కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావు పేట విజయవాడ |
విడుదల: | మూడవ ముద్రణ 2009 |
కథనం,పాత్రలు
మార్చుమందాకిని నవల ద్వారా సిగరెట్, లిక్కర్, పేకాట, వ్యభిచారం వంటి చెడు వ్యసనాల ద్వారా మధ్యతరగతి మగవాళ్ళు చెడిపోతుంటే అలాంటి అలవాట్లున్న భర్తలను భార్యలు ఎలా మార్చుకోవచ్చో వివరించాడు రచయిత. నవలలో పాత్రలు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవి.
- మందాకిని
- భానుమూర్తి (మందాకిని భర్త)
- వసంతలక్ష్మి (భానుమూర్తి మొదటి భార్య)
- వాసంతి (మందాకిని చెల్లెలు)
- ఉమామహేశ్వరరావు (మందాకిని తండ్రి)
- అచ్చమాంబ (మందాకిని తల్లి)
- యోగీంద్ర (వాసంతి భర్త)
- హేమాద్రి (మందాకిని తమ్ముడు)
వసంతలక్ష్మి, మందాకిని, వాసంతి, హేమద్రి ఉమామహేశ్వరరావు సంతానం. పెద్దకూతురు వ్యసనపరుడైన అల్లుడు పెట్టే బాధలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. మూడోకూతురు యోగీంద్రను ప్రేమించి గర్భవతి కావడం, మందాకినికి కట్నం ఇవ్వలేక పెళ్ళికాకపోవడం వలన మందాకిని ఇష్టం లేకున్నా చెల్లెలి బ్రతుకు పాదవుతుంది అనే కారణంతో తన అక్క మొగుడైన భానుమూర్తిని వివాహం చేసుకుంటుంది. వివాహం తరువాత తన తెలివి, ఓపిక, మంచితనంతో అతడిని ఒక గొప్పవ్యక్తిగా ఎలా మర్చింది అనేది రచయిత అందరూ ఆచరించదగ్గ అనేక సలహాలు, సూచనలతో చెప్పాడు.
విశేషాలు
మార్చు- వ్యసనాలను వదిలించే మంచి సలహలను రచయిత ఇవ్వడం జరిగింది
- రచయిత నాటకాలు ఎలా రచించవచ్చో, మంచినాటకానికి లక్షణాలు ఎలాఉండాలి, నాటకం ఎంత సమయం ఉండాలి అనే విషయాలు కథానాయకుడి పాత్రద్వారా వివరించాడు
- వంటిటికి సంబంధించి ఉపయోగపడే అనేక చిట్కాలను మందాకిని అత్త పాత్ర ద్వారా వివరించాడు
- చదరంగం యొక్క ప్రాముఖ్యత, కాళీ సమయాల్లో ఇంట్లో పిల్లలతో భార్యాభర్తలు ఆడుకోగలిగే అనేక ఆటలను చేర్చారు.