మల్లాది వెంకట కృష్ణమూర్తి

ప్రముఖ రచయిత

మల్లాది వెంకట కృష్ణమూర్తి సమకాలీన తెలుగు రచయితలలో పేరున్న వాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి.

మల్లాది వెంకట కృష్ణమూర్తి
జననంమల్లాది వెంకట కృష్ణమూర్తి
13 నవంబరు, 1949
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంవిజయవాడ
వృత్తిఆడిటరు
ప్రసిద్ధితెలుగు కథా రచయిత
మతంహిందువు
తండ్రిమల్లాది దక్షిణామూర్తి
తల్లిమల్లాది శారదాంబ

జీవిత విశేషాలుసవరించు

బాల్య విశేషాలుసవరించు

ఆయన 1949, నవంబర్ 13విజయవాడలో జన్మించాడు.[1] మల్లాది శారదాంబ, మల్లాది దక్షిణామూర్తి ఆయన తల్లిదండ్రులు. వారి కుటుంబంలో ఆయన ఏడో సంతానం. 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఆయన 1972 వరకు వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసి, హైదరాబాదు లోని ప్రభుత్వ అడిట్ కార్యాలయంలో ఆడిటరుగా చేరాడు. 1986 లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఎందరో సంపాదకులు, మల్లాది చిత్రాన్ని, తమ పత్రికలలో ప్రచురిస్తామన్న అభ్యర్దనకు, రచయిత తన అంగీకారమివ్వనందువలన, మల్లాది ఛాయాచిత్రం ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు.

మల్లాది రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ ఆయన బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. ఆయనకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనం అంటే ఎంతో ఆసక్తి. వారి అమ్మ మల్లాది శారదాంబ ఆంధ్ర ప్రభ వీక్లీ కొనేది. వారి పక్కింటివాళ్ళు ఆంధ్ర పత్రికని కొనేవారు. వాటిని వారు ఎక్సేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళు.ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఈపద్ధతిని అనుసరించేవారు. ఇలా ఏడో ఏటనించే ఆయన తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించారు. సాయంత్రాలు ఆయన వారి ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవారు. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. ప్రస్తుతం అది లేదు.

ఆయనకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి దీపావళికి ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రికల ప్రత్యేక సంచికలు. ఎక్కువ పేజీలతో, కునేగా మరికొలందు సెంటుతో ఘుమ ఘుమలాడుతూ వచ్చేవి అవి. వాటిని చదవడానికి వారి కుటుంబ సభ్యులంతా పోటీ పదే వారు. ఆనాటి చాలామంది పాఠకులకి కూడా ఈ అనుభవం వుండి వుంటుంది. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే యువ, జ్యోతి మాస పత్రికలూ దీపావళి, సంక్రాంతి పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. అవసరాల రామకృష్ణారావు, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, భరాగో, పెద్దిభొట్ల సుబ్బరామయ్య,ఆదివిష్ణు తదితరుల కథలు వాటిలో వచ్చేవి.

సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేవి. వాటిని ఆసక్తిగా చదివేవారాయన. పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవారు.

ఇవి కాక టెంపోరావు, గుత్తా బాపినీడు, డాక్టర్, భయంకర్, విశ్వప్రసాద్, ప్రసాద్, కనకమేడల, కొమ్మూరి సాంబశివరావు మొదలైన వారి డిటెక్టివ్ నవలలని వారింట్లో అద్దెకి వున్న మద్డాలి సీతమ్మ గారు తమ బంధువుల నుంచి తెచ్చి ఇచ్చేవారు. డిటెక్టివ్ నవలల్లో ఇలా విసుగు కలిగించేవి కనిపించేవి కావు. ఎందుకంటే వారు కథని సంభాషణల ద్వారా నడిపించేవారు. పత్రికల్లోని రచనలకి, డిటెక్టివ్ నవలలకి తేడాని స్పష్టంగా గమనించ గలిగారాయన. డిటెక్టివ్ నవలల్లో ఫిలాసఫీని చెప్పేవారు కారు. సాధారణంగా నవల సంభాషణలతోనే మొదలయ్యేది. గాంధీనగర్లోని న్యూ ఇండియా సెంటర్లో బళ్ళ మీద అద్దెకి ఇచ్చే కొమ్మూరి నవలలని తెచ్చుకుని చదివే వారాయన. వాటి వెల అర్థరూపాయి. రోజుకి అణా అద్దె. వాటిని అణా లైబ్రరీలు అనేవారు. ఆరోజుల్లో ఆయన పత్రికల్లో చదివిన అనేక వేల మంది రచనా విధానాలే ఆయనకు మార్గదర్శకత్వం అయ్యాయి. ఎలా రాయలో కంటే ఎలా రాయకూడదో ఆయనకు చిన్న వయసులోనే తెలిసింది. ఏ సమాచారం పాఠకుడిగా నాకు విసుగ్గా వుండేదో దాన్ని ఆయన రచనలనల్లో దొర్లకుండా వారు రచయితగా మొదటినించి జాగ్రత్తని తీసుకోసాగారు. పైగా మెత్తటి వాక్య నిర్మాణంలో దిట్ట అయిన కొమ్మూరి సాంబశివరావు నవలలు అన్ని అనేకమార్లు చదవడం వల్ల ఆయనకు అలాంటి వాక్యాలు రాయడం బాగా పట్టుపడింది. ఏది పాఠకుడిని కన్ఫుస్ చేయకుండా, వారి మెదడుని స్ట్రైన్ చేయకుండా చెప్పాలి అని ఆయన బాగా గ్రహించారు. ఆ సూత్ర్రాన్ని ఆనాటి డిటెక్టివ్ రచయితలు గ్రహించి పాటించారు. పత్రికల్లోని కథల పోకడకి, డిటెక్టివ్ నవలల్లోని పోకడకి గల తేడాని పట్టుకోగలిగారు. ఈ కారణంగా నా శైలి సులభంగా వుంటోంది.

ఆయన కాలేజిలో చదివేప్పుడు ఓ సారి ఓ కథని రాసారు. అది తెలిసి వారి నాన్న మల్లాది దక్షిణామూర్తి గారు చదువు చెడుతుందని కథలని రాయద్దని చెప్పారు. దాంతో మళ్లీ రాయలేదు. అప్పుడప్పుడు వారి నాన్నగారు, `కథలు రాస్తున్నావా? మానేశావా? అని అడిగేవారు కూడా. బి కాంలో ఆయన క్లాసుమేటు మురళి అని ఒకడు వుండేవాడు. అతనికి కూడా సిస్టర్స్ మల్లాది లాగానే. దాంతో నాలానే చిన్నప్పటినుంచి చదివేవాడు. ఓ రోజు ఆయనకు వారు రాసిన కథని చదవమని ఇచ్చాడు. ఘనమైన అయ్యా ` అన్న పదాలతో అది మొదలైంది. మర్నాడు వారిద్దరూ అలంకార్ సినిమా హాల్ని దాటి ఎదురుగా వున్నా వంతెన మీదకి రాగానే కథ ఎలా వుందని అడిగాడు. కథా రచనలో మల్లాది ఏర్పరచుకున్న అభిప్రాయాలని అన్నిటి ప్రకారం ఆ కథ బాగా లేదని విస్లేశానాత్మకంగా చెప్పారాయన. ఆయన పరిజ్ఞానికి స్నేహితునికి ఆశ్చర్యం వేసింది. వారు మంచి మిత్రులే అయినా ఎన్నడు కథల గురించి అంతదాకా మాట్లాడుకోలేదు. ఆతను తర్వాత దేవరకొండ మురళి అనే తన పేరుతో 10 దాక కథలు రాసాడు.

ఉద్యోగంసవరించు

1970 లొ ఆయన చదువు బీకాం అయిపోయింది. ఉద్యోగ రీత్యా సికింద్రాబాద్ వచ్చి, 1970 ఫిబ్రవరిలో వారి నాన్న గారు మల్లాది దక్షిణామూర్తి మిత్రులు శ్రీ ముస్త్యాల వెంకయ్య గారి ఇంట్లో, రాష్ట్రపతి రోడ్లోని పోస్ట్ ఆఫీసు ఎదురుగా వున్న ఇంట్లో బస చేసారు. వారికి చిన్నప్పటి నుంచి కథలకి ఐదియాస్ తట్టేవి. వాటిని ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారాయన. అక్కడ ఉద్యోగంలో చేరిన మొదటి ఆదివారం ఓ కథని రాసారు. తర్వాత ఫెయిర్ చేసి దాన్ని చందమామకి పోస్ట్ చేసారు. పత్రికకి, ప్రభాకి, అపరాధ పరిశోధనకి వరసగా ఒకో కథని ఒకో ఆదివారం రాసి పోస్ట్ చేసారు. వారు అప్పుడు ఓ సంగతి గమనించారు. ఫెయిర్ చెయ్యడానికి చిత్తు ప్రతి చూడకుండానే తర్వాతి పదం, వాక్యం అలానే రాసేవారాయన. తర్వాత చూస్తే చిత్తు ప్రతిలో అలాగే వుండేది. ఇలా చాలాసార్లు అనుభవం అయ్యాక ఆయన వాక్యాలని, పదాలని ఒకేలా రాస్తారని అర్థమయ్యిందాయనకు. దాంతో తిరగరాసే ప్రయత్నం మానుకున్నారు.

వెంకయ్య గారి పుత్రులు ముస్త్యాల భూమయ్య, లక్ష్మణ రావులు. లక్ష్మణరావు గారికి, ఆయన శ్రీమతి ప్రభావతికి పత్రికా పఠనం అలవాటు. మల్లాది గారు సికందరాబాద్ రైల్వే స్టేషను దగ్గర సిటి బస్సు ఎక్కేవారు. అక్కడ మేగ్సిన్స్ అమ్మే షాపులు చాలా వుంటాయి కాబట్టి ఆయన వారం, వారం ప్రభ, పత్రికలని, నెల నెలా చందమామని కొనుక్కు రమ్మని, నెలాఖరుకి లెక్క చూసి డబ్బు ఇచ్చేవారు. వారు కారు ఆపుకుని కొనాల్సి వచ్చేది కాబట్టి ఆ పనిని మల్లాదికి పురమాయించారు. ఆగష్టు 2 1970 న ఆయన చందమామని సికింద్రాబాద్ స్టేషను దగ్గర ఓ పుస్తకాల షాపులో కొన్నారు. బస్సులో కూర్చోడానికి చోటు లేక నించుని రావడంతో దాన్ని తిరగేయలేదు. ఇంటికి నడచి వస్తూ చూసారు కాని ఆయన రాసిన కథ కనపడలేదు. రాగానే లక్ష్మణరావు గారు నా చేతిలోంచి దాన్ని తీసుకుని తెరవకుండానే చెప్పారు.

లక్ష్మణరావు: “దీంట్లో నీ కథ ఒకటి పడిందని పందెం.“
మల్లాది: ఆ పత్రికకి కథని పంపానన్న సంగతి గుర్తున్నా వేసుకుంటామనే కార్డు రాలేదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పారు “రాలేదని పందెం.“
లక్ష్మణరావు: “కథ వస్తే దీనికి పంపే డబ్బు నాకు ఇవ్వాలి.“
మల్లాది: “అలాగే.“ధైర్యంగా వొప్పుకున్నారు.
లక్ష్మణరావు: ఓ పేజి తెరచి అందులో వచ్చిన సింగిల్ పేజి కథని నాకు చూపించారు.

`ఉపాయశాలి` అన్న పేరు గల ఆ కథ, కింద మల్లాది వెంకట కృష్ణ మూర్తి అనే పేరు కనపడింది. అది ఆయన రాసిన కథే!. అప్పుడు వారికి అర్థం కాలేదు ఆ సంగతి ఆయనకీ ఎలా తెలిసిందో. బహుసా చందమానించి కథని ప్రచురణకి తీసుకున్నమన్న కార్డ్ వచ్చి వుంటుంది. అది ఆయన దాచి వుండచ్చు. మల్లాదికి ఎన్నడు ఆ కార్డు ఆయన ఇవ్వలేదు. ఆ విధంగా తొలిసారి 1970 ఆగష్టు రెండో తారీకు సాయంత్రం అయిదున్నర-ఆరు మధ్య ఆయన పేరుని ౬౮ రాష్ట్రపతి రోడ్లోని ఆ ఇంట్లో అచ్చులో చూసుకున్నారు. ఆ ఇంట్లో చాల కథలు రాసారు.ఆయన రాసిన మొదటి కథే వెనక్కి రాకుండా ప్రచురించబడింది. అంతే కాకుండా వరసగా పత్రిక, ప్రభ, అపరాధ పరిశోధనల్లో కూడా నాకథలు వెంట వెంటనే వరసగా వచ్చాయి.

రచయితగాసవరించు

పేరు మల్లాది వెంకట కృష్ణ మూర్తి 125 దాకా నవలలు, 3000 పైచిలుకు కథలు, కొన్ని వ్యాసాలూ,ఆధ్యాత్మిక విషయాల మీద డజనుకి పైగా పుస్తకాలు రాసారు. హిందీలో ఒకటి, కన్నడంలో మూడు, తుళు భాషలో ఒకటి, తెలుగులో డజనుకి పైగా ఆయన నవలల ఆధారంగా సినిమాలు వచ్చాయి. పోలీసు రిపోర్ట్, తేనెటీగ అనే చిత్రాలకి మాటలు రాసారు. యాత్రా సాహిత్యం ట్రావలాగు ఐరోపా, ట్రావలాగు సింగపూర్, ట్రావలాగు అమెరికా, అమరికాలో మరోసారి. కర్మ-జన్మ తాజా పుస్తకం. పిల్లల పేర్ల పుస్తకం, వంటల పుస్తకం, టిఫిన్ వరైటీలు, కథలు ఎలా రాస్తారు లాంటి నాన్-ఫిక్షన్ పుస్తకాలు, కొన్ని జోక్స్ కలక్షన్స్లని కూడా వేలువరించారు. .

నవలలుసవరించు

 1. ది గెస్ట్
 1. ఆధ్యాత్మక చిన్న కథలు [2]
 2. అందమైన జీవితం
 3. చంటబ్బాయి (ఈ నవల చంటబ్బాయి సినిమాగా నిర్మించబడినది)
 4. కల్నల్ ఏకలింగం ఎడ్వంచర్స్
 5. డి ఫర్ డెత్
 6. దైవం వైపు
 7. ధర్మ యుద్ధం
 8. ఎఫ్ ఐ ఆర్
 9. లూపికా రాణి అతడు ఆమె
 10. మందాకిని
 11. రెండు రెళ్లు ఆరు
 12. మిస్టర్ వి
 13. మిష్టర్ నో
 14. సముద్రపు దొంగలు
 15. ముద్దుకు మూడే ముళ్ళంట
 16. ముంగిట మృత్యువు
 17. నిన్నటి పున్నమి
 18. నాకు నువ్వు, నీకు నేను
 19. ఓ మంచి మాట
 20. పారిపోయిన ఖైదీలు
 21. బలి కోరిన వజ్రాలు
 22. ప్రాక్టికల్ జోకర్
 23. పున్నమి
 24. రాక్షస సంహారం
 25. సావిరహే
 26. ష్ గప్ చుప్
 27. సద్దాం ఆంటీ ఇంటి కథ
 28. శనివారం నాది
 29. స్మయిల్ ప్లీజ్
 30. సారీ రాంగ్ నెంబర్
 31. తేనెటీగ
 32. అంకుల్ సాం - ఓ ప్రేమికుడు ఒక అగ్ర రాజ్యం మీద సలిపినపొరులోని ముఖ్యపాత్రధారి.
 33. వైకుంఠ యాత్ర
 34. లిటిల్ రాస్కెల్
 35. కొత్త శతృవు
 36. నత్తలొస్తున్నాయి జాగ్రత్త
 37. డెత్ సర్టిఫికెట్
 38. గ్రీన్ కార్డ్
 39. అ ఆ ఇ ఈ
 40. కథాకేళి
 41. అనగనగా ఓ నాన్న

కథల పుస్తకాలుసవరించు

 1. పిల్ల ఆఫిల్స్ పుస్తకం
 2. నవ్వుల రవ్వలు

నాటికలుసవరించు

యాత్రానుభవాలుసవరించు

 1. ట్రావెలాగ్ అమెరికా
 2. ట్రావెలాగ్ యూరోప్

వ్యాసాలుసవరించు

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-07-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 2. మల్లాది వెంకట కృష్ణమూర్తి...చిన్న కథలు..1

బయటి లింకులుసవరించు

కినిగెలో మల్లాది వెంకట కృష్ణమూర్తి డిజిటల్ పుస్తకాలు