మందులు.కె
మందులు.కె (మే 1, 1944 - మే 22, 2002) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు.[1] నాటకరంగంలో చేసిన కృషికి పలు కళాసంస్థలు ఈయనకు నటకాగ్రేసర, నటవిరాట్, నటశేఖరుడు, రంగస్థల నటబ్రహ్మ వంటి బిరుదులు ఇచ్చి సత్కరించాయి.
మందులు.కె | |
---|---|
జననం | మే 1, 1944 |
మరణం | మే 22, 2002 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, దర్శకుడు |
జననం
మార్చుమందులు 1944, మే 1న తాతయ్య, ముత్యాలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, రాయకుదురు గ్రామంలో జన్మించాడు.
విద్యాభ్యాసం - ఉద్యోగం
మార్చురాయకుదురులో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన మందులు, వీరవాసరంలో ప్రాథమికోన్నత విద్య, భీమవరంలో పియుసి విద్యను పూర్తిచేసాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చుబి.ఎన్. సూరి రచించిన పనిమనిషి నాటకం ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టిన మందులు అనేక నాటకాల్లో నటించాడు. 1984లో అర్.కె. ప్రొడక్షన్సు అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థ నుండి అనేక నాటకాలు ప్రదర్శించాడు.
నటించిన నాటకాలు
మార్చు- కీలుబొమ్మలు
- అడవి
- ఎవరిని నమ్మకు
- ఉద్ధరింపు
- చిల్లరకొట్టు చిట్టెమ్మ
- ఐపీసీ 302
- ఛైర్మన్
- సమర్పణ
- పాపం
- లాటరీ
- కాలం వెనక్కి తిరిగింది
- మృత్యుంజయుడు
- నటన
- ఎంతెంత దూరం
- ఆకాశరామన్న
- రాగరాగిణి
- తరంగాలు
- ఆరణి
- మనిషి సావకూడదు
- కిం కర్తవ్యం
- వయసు - మనసు
- మరోమొహెంజదారో
దర్శకత్వం వహించిన నాటకాలు
మార్చు- పలుకే బంగారమాయె
- రాజసూయ యాగం
- ఓ అమ్మాయి కథ
- అనగనగా ఒకరాజు
రచించిన నాటకాలు
మార్చుమందులు కె.జి. వేణుతో కలిసి పంచతంత్రం అఖండ విప్లవజ్యోతి, అంబేద్కర్ వంటి నాటకాలు రచించాడు.
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.454,455.