మచ్చ హరిదాస్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మచ్చ హరిదాస్ (జననం. డిసెంబర్ 2, 1949) ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకుడు .
డా.మచ్చ హరిదాస్ ( Dr.Macha Haridas ) | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | M.A,PhD,PGDT (ఉస్మానియా విశ్వవిద్యాలయం) |
వృత్తి | రచయిత, పరిశోధకుడు |
తల్లిదండ్రులు | మచ్చ వీరయ్య,బుచ్చి రామక్క |
జీవిత విశేషాలు
మార్చుమచ్చ హరిదాస్ , కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం, గునుకుల కొండాపురం గ్రామంలో మచ్చ వీరయ్య, బుచ్చి రామక్క దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.,పిహెచ్.డి , ఆంధ్రా యూనివర్సిటీ నుండి పిజిడిటి పూర్తి చేసాడు.
కుటుంబం
మార్చుభార్య: భారతి, కుమారులు: రాజశేఖర్ , చంద్రశేఖర్ ,ఇందుశేఖర్
పరిశోధనలు
మార్చు- "తథ్యము సుమతీ!"- సుమతీ శతక పద్యాలు - 1984.
- "తెలుగులో యాత్రాచరిత్రలు" అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎన్.గోపి పర్యవేక్షణలో పి.హెచ్.డి. పట్టా కోసం పరిశోధన చేసి 1989లో సిద్ధాంత వ్యాసం సమర్పించాడు.
రచనలు
మార్చు- "తథ్యము సుమతీ!"- సుమతీ శతక పద్యాలు - పరిశోధన గ్రంధము - 1984 .
- తెలుగు లో యాత్రా చరిత్రలు - సిద్ధాంత గ్రంధము- 1992 .
- గోరుకొయ్యలు - నానీలు - 2006
- హరిచందనము- అభినందన సంచిక - 2008
- యేనుగుల వీరస్వామి ( జీవిత చరిత్ర ) - 2011
- వ్యాసలహరి ( సమీక్షలు ) - 2012
- యాత్రా చరిత్రలు ( లఘు గ్రంధం )- తెలుగు విశ్వవిద్యాలయం ముద్రణ - 2012
- తధ్యము సుమతీ! ( పరివర్తిత ముద్రణము ) - 2017
- గునుకుల కొండాపురం-పద్మశాలీయులు బూట్ల వంశం- ఏడు తరాల చరిత్ర - 2018
- తెలుగు లో యాత్రా రచనల సూచి - 2021
- అష్టాదశ ( సాహిత్య విమర్శ వ్యాసాలు ) - 2021
- వ్యాస భారతి - 2022
- హరిదాసు రచనలు- వ్యక్తిత్వం - 2022
అవార్డులు-సన్మానాలు
మార్చుజిల్లా స్థాయి
మార్చు- జిల్లా కలెక్టర్, కరీంనగర్ "సుమిత డావ్రా"గారి చే ప్రశంసా పత్రం - 2004 .
- డా.జైశెట్టి రమణయ్య విద్యాసంస్థలు , జగిత్యాల వారిచే ఉత్తమ అధ్యాపక సన్మానం, రజత పతక ప్రదానం - 2005.
- లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, కరీంనగర్ శాతవాహన, కరీంనగర్ మానేరు సంస్థల సంయుక్త నిర్వహణలో సన్మానం-ప్రశంసాపత్రె - 2006.
రాష్ట్ర స్థాయి
మార్చు- రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.స్.రాజశేఖర్ రెడ్డి గారిచే రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు , సన్మానము- 2008.
- తెలంగాణ రాష్ట్ర స్థాయి యం.వి.నరసిం హా రెడ్డి సాహితీ పురస్కారము - 2015.
- తెలంగాణ రాష్ట్ర స్థాయి బొందుగులపాటి పురస్కారము "తథ్యము సుమతీ!" గ్రంథానికి - 2016.
- మూడ నాగభూషణం గుప్త గారి రాష్ట్ర స్థాయి పురస్కారము బాసర లో - 2018.
- మలయశ్రీ నవ్య సాహిత్య పరిషత్, కరీంనగర్ ఆధ్వర్యం లో సురవరం ప్రతాపరెడ్డి స్మారక పురస్కారము-- 2019.
- సర్వవైదిక సంస్థానం కరీంనగర్ నిర్వహణ లో ఆచార్య శ్రీ భాష్యం విజయసారధి గారి నుండి బెజ్జంకి సత్యపాల్ రావు స్మారక పురస్కారము - 2021.
- అక్కేపల్లి మమత స్మారకార్థం అక్కేపల్లి ఫౌండేషన్, కరీం నగర్ వారి సి నా రె విశిష్ట సాహిత్య పురస్కారం - 2021.
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'కీర్తి పురస్కారం' - 2022.
- తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పాలనా యంత్రాంగం సమర్పించిన డా.గోపు లింగారెడ్డి పురస్కారం - 2023.
ఉద్యోగాలు
మార్చు- జూనియర్ కాలేజి లెక్చరర్ గా 11 సంవత్సరాలు.
- డిగ్రీ కాలేజి లెక్చరర్ గా 23 సంవత్సరాలు.
- 2008 లో శ్రీ రాజరాజేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (SRR), కరీంనగర్ నుండి రీడరు గా పదవీవిరమణ.
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు- మచ్చ హరిదాసు (1992). తెలుగులో యాత్రాచరిత్రలు (1 ed.). కరీంనగర్: ఇందు ప్రచురణలు.