ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన మట్టిమనుషులు చిత్రం తెంగాణ గ్రామీణ వలస కార్మికుల జీవితాలకు అద్దం పట్టేదిగా నిలిచింది. కె.ముఖర్జీ, మణికొండ వేదకుమార్‌ నిర్మాణసారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నాటి సామాజిక విలువలను చాటేదిగా ఉంది. అర్చన, మోహిన్‌ అలీ బేగ్‌, నీనా గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎ.కె.బీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. కార్మికులు ప్రధానంగా భవన నిర్మాణ కూలీల జీవితాలు ప్రధాన కథాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రం డిప్లొమా ఆఫ్‌ మెరిట్‌ అవార్డును అందుకుంది[1][2]. 1990లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ చిత్రం ప్రదర్శితమైంది[3].

మట్టి మనుషులు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.నరసింగరావు
తారాగణం అర్చన,
మొయిన్ ఆలీ బేగ్
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ లిటిల్ ఇండియా
భాష తెలుగు

పల్లె నుంచి పట్టణాలకు వలసలు, వడ్డీవ్యాపారులు, కార్మికులు, మధ్యవర్తులు, భవన నిర్మాణ రంగంలో ప్రమాదాలు, మహిళ వ్యథలు, సాయం పేరుతో చేసే మోసాలు...ఇలా జీవితాల్లోని ఎన్నో అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కమర్షియల్‌ సినిమాకు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది.

జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ గ్రామీణ నిరుపేద కార్మికురాలి ఆశలు ఎలా రాలిపోయాయో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లుగా చూపింది. విలువలు వదిలేసిన భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక మహిళ జీవితాన్ని ఎలా ఛిద్రం చేసిందో ఇందులో చూడవచ్చు. మనుషుల్లో దిగజారిన విలువలు, వ్యసనాలు, వీడిపోని మమతలు, అంతులేని ఆవేదన...అన్నింటికీ ఇచ్చిన దృశ్యరూపమే ‘మట్టి మనుషులు’. ఈ సినిమా చూస్తుంటే తెరపై నిజజీవితం దర్శనమిస్తుంది. ఆయా పాత్రలు ప్రాణం పోసుకొని మన పక్కన సంచరిస్తున్నట్లుగా, మనం కూడా ఆ పాత్రల్లో ఒకరిగా అనిపిస్తుంటుంది.

అవార్డులుసవరించు

  • నేషనల్ ఫిల్ం ఫేర్ అవార్డు
  • తెలుగు లో ఉత్తమ చిత్రంగా నేషనల్ ఫిల్ం అవార్డు.- బి.నరసింగరావు.

మూలాలుసవరించు

  1. "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
  2. "Telugu creative genius Narsingh Rao's films regale Delhi". News.webindia123.com. 2008-12-21. Retrieved 2012-08-27.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-04-03. Retrieved 2015-11-23.