బి.నరసింగరావు
ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు బి. నరసింగరావు. ఇంటిపేరు బొంగు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, పెయింటర్‌గా, కవిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్లో 1946లో జన్మించారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా వాటి ప్రభావం, ప్రత్యేక ముద్ర మాత్రం విశ్వానికి వ్యాపించింది. తెలంగాణ జీవన చిత్రాలనే తన సినిమాలుగా రూపొందించిన అచ్చమైన స్వచ్ఛమైన ప్రజాకళాకారుడు. ఆయన. ఆయన తీసిన ఒక్కో సినిమా ‘తెలంగాణ సినిమా’కు ఓ గ్రామర్, బలమైన పునాదిని సృష్టించింది. రంగుల కల, దాసి (1988 సినిమా), మట్టి మనుషులు, సినిమాలే అందుకు ఉదాహరణ. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించింది. నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అనేక అంతర్జాతీయ గౌరవాలు పొందారు. మా భూమి సినిమాను 1979 లో కైరో, సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్స్, కార్లోవీ ఫిల్మ్ ఫెస్టివల్ లో వారీ ప్రదర్శించారు. 1989లో దాసి, 1991లో మట్టి మనుషులు మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లొమా గెలిచింది. మా ఊరు హంగేరి అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుచుకుంది. ఈయన దర్శకత్వం వహించిన హరివిల్లు (ఫిచర్ ఫిల్మ్) 2003 లో 56వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైనది.
చిత్రసమాహారం
మార్చుడైరెక్టర్ గా
మార్చు- రంగుల కల (1983)
- ది కార్నివాల్ (డాక్యుమెంటరీ, 1984)
- ది సిటీ (డాక్యుమెంటరీ, 1985)
- మా ఊరు (డాక్యుమెంటరీ, 1987)
- దాసి (1988)
- మట్టి మనుషులు (1990)
- హరివిల్లు (2003)
స్క్రీన్ ప్లే రచయితగా
మార్చు- మా భూమి (అనుకరణ / డైలాగ్, 1979)
- దాసి (రచయిత, 1988)
- హరివిల్లు (అనుకరణ / కథ, 2003)
సంగీత దర్శకుడు గా
మార్చు- మా భూమి (1979)
- హరివిల్లు (2003)
నిర్మాతగా
మార్చు- మా భూమి (1979)
- దాసి (1988)
నటుడిగా
మార్చు- రంగులకల (1983)
అవార్డులు
మార్చుతెలుగు లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
మార్చు- రంగుల కల (1983)
- దాసి (1988)
- మట్టి మనుషులు (1990)
ఉత్తమ మానవశాస్త్ర / ఎథ్నోగ్రాఫిక్ సినిమా జాతీయ సినిమా పురస్కారం
మార్చు- మా ఊరు (1987)
ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు
మార్చు- మా భూమి (సినిమా) (1979)
ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు
మార్చు- హరివిల్లు - బాలల చిత్రం (2003)
పురస్కారాలు
మార్చు- 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం