మట్టెగుంట వెంకట రాధాకృష్ణారావు

మట్టెగుంట వెంకట రాధాకృష్ణారావు సుప్రసిద్ధ వైద్యులు.

జీవిత విశేషాలు మార్చు

ఆయన గుంటూరు జిల్లా లోని నగరం మండలానికి చెందిన అల్లపర్రు గ్రామంలో నవంబరు 1 1903 న జన్మించారు. ఆయన తండ్రి వెంకటరమణయ్య. 1928 లో ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసారు. లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎఫ్.సి (పాథాలజీ) డిగ్రీ అందుకున్నారు.[1]

ఉద్యోగ జీవితం మార్చు

ఆయన కూనూరు రీసెర్చి లేబొరేటరీకి రీసెర్చ్ స్కాలర్ గా ఉంటూ (1935-41) పరిశోధనలు ప్రారంభించారు. బొంబాయి లోని హాఫ్‌కిన్ ఇనిస్టిట్యూట్ వారి న్యూట్రిషన్ అండ్ ఎక్స్‌పెరిమెంటు పాథాలజీ విభాగానికి అసిస్టెంటు డైరక్టరుగా, విభాగాధిపతిగా (1941-49) పనిచేసారు.[2] 1947 లో మెడికల్ రీసెర్చి కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లో రీసెర్చ్ స్కాలర్ గా యున్నారు.హాఫ్‌కిన్ ఇనిస్టిట్యూట్ లోనే (బొంబాయి) న్యూట్రిషన్ విభాగానికి అధిపతిగా ఉన్నారు (1949-61). కె.ఇ.ఎం. హస్పటల్ బొంబాయికి న్యూట్రిషన్ సంబంధించి గౌరవ సలహాదారుగా (1963) ఉన్నారు. 1952 లో బర్మా ప్రభుత్వానికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున న్యూట్రిషన్ సలహాదారునిగా ఉన్నారు.

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1945), ఇండియన్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మొదలగు ప్రఖ్యాత వైద్య సంస్థల ఫెలోషిప్‌తో అనితరసాధ్యమైన పరిశోధనలు నిర్వహించారు.

డా. రావు మానవ పౌష్టికాహార రంగంలో ప్రత్యేక నిపుణునిగా దేశ విదేశాలలో ప్రఖ్యాతి పొందారు. 70కి పైగా పరిశోధనా పత్రాలను దేశ విడేశీ మెడికల్ జర్నల్స్ లో వెలువరించారు.[3] అనేక మోనోగ్రాఫ్స్ ను రచించారు.[4] ఆయన వ్రాసిన వాటిలో ప్రసిద్ధి పొందినవి diet manual, road to good nutrition, Cirrhosis of the liver in NOrthern circles, Technical reports on diet and nutrition surveys.[5]

గౌరవ పదవులు మార్చు

ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలలో గౌరవ పదవులను అధిష్టించారు.

  • పాథలాజికల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.
  • న్యుట్రిషన్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్వర్యంలో పోషకాహార సలహా మండలి నిపుణులు.
  • నేషనల్ న్యూట్రిషన్ అడ్వయిజరీ కమిటీ (భారతదేశం)
  • మెడికల్ అండ్ వెటర్నల్ విభాగం. (ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లోనిది)

మూలాలు మార్చు

  1. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీవాసవ్య. 2011.
  2. "Fourth Report - the Dr. Rath Health Foundation!" (PDF). 4.dr-rath-foundation.org/. 1 July 1955. Archived from the original (PDF) on 2013-03-21.
  3. "COMPENDIUM OF ICMR RESEARCH PAPERS (1919-2010)" (PDF). icmr.nic.in/. INDIAN COUNCIL OF MEDICAL RESEARCH New Delhi. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-07-15.
  4. "Dietetic Hepatic Lesions and Protein Deficiency". nature.
  5. "Browsing GIPE Digitised Books by Author "Radhakrishna Rao, M V"". dspace.gipe.ac.in/. Retrieved 15 July 2015.

ఇతర లింకులు మార్చు