మంచం

(మడత మంచం నుండి దారిమార్పు చెందింది)

మంచం మనము పడుకుని నిద్ర పోయే గృహోపకరణము. మంచం మీద పరుపు వేసి లేదా కొన్ని సందర్భాలలో దుప్పటి వేసి నిద్రిస్తాము. ఇంటిలో మంచం సామాన్యంగా పడక గదిలో ఉంటుంది.

నిర్మాణము

మార్చు

మంచం కలపతో గాని లేదా ఇనుముతో గాని తయారుచేస్తారు. మంచానికి నాలుగు కోళ్ళు లేదా కాళ్ళు ఉంటాయి. వీటిని అడ్డంగా, నిలువుగా కలుపుతూ బద్దెలుంటాయి. పైభాగంలో ప్లైవుడ్ కానీ లేదా రేకు గాని వేస్తారు. కొన్నింటిలో దారంతో చేసిన నవారు పట్టీ నేస్తారు లేదా మందపు గుడ్డ రెండు వైపులా బిగిస్తారు. బద్దెల్ని, కాళ్ళను బిగిస్తూ పెద్ద మరలుంటాయి.

 
డెట్మోల్డ్ ఓపెన్-ఎయిర్ మ్యూజియం ప్రాంగణంలో పడకగది

రకాలు

మార్చు
  • మడత మంచం : పగటి సమయంలో నిద్రించిన తర్వాత మంచాన్ని మడిచిపెట్టుకోవడానికు అనువుగా తయారుచేసిన మంచాన్ని మడత మంచం అంటారు. దీనికి ఒకవైపుండే రెండు కాళ్ళు 'X' లాగా ఏర్పాటుచేసి మధ్యలో మర బిగిస్తారు. అడ్డ పట్టీ లేకుండా రెండు నిలువు పట్టీలను కలుపుతూ దళసరి దుప్పటి లాంటి గుడ్డతో కుడతారు.దీనిని మడతమంచం పట్టా అంటారు. మడత పెట్టినప్పుడు సన్నంగా ఉండి గోడకు ఆనించుకోవడానికి అనువుగా ఉంటుందు.
  • నులక మంచం : నులక తాడుతో మంచం పట్టీలను వల లాగా అల్లుతూ పై భాగాన్ని తయారుచేస్తే వాటిని నులక మంచం అంటారు. నులకమంచం అనేది నులక అనే ఒకరకమైన పురికొస లాంటి తాడు సహాయంతో అల్లికతో తయారు చేసిన మంచం. పల్లెల్లొ ఈ నులక మంచాన్ని బాగా వాడుతారు. నులక మంచం తయారు చేయటం కొంచం శ్రమ తొకూడుకున్న పని. ఎక్కువ రోజులు వాడిన ఈ మంచాల్లొ నల్లులు చేరుతాయి !
  • నవారు మంచం : మంచానికి పట్టీలను కలుపుతూ నవారు అల్లితే దానిని నవారు మంచం అంటారు. ఈ నవారు అనగా సన్నని మందపు దారంతో అల్లిన పట్టీ. దీనిని రెండు నిలువు పట్టీలను, రెండు అడ్డ పట్టీలను కలుపుతూ ఒక వల లాగా గట్టిగా అల్లుతారు.
  • పందిరి మంచం : మంచానికి పైభాగంలో పందిరి లాగా కర్రతో చేసిన ఫ్రేమ్ నిర్మిస్తే దానిని పందిరి మంచం అంటారు. వీటిని దోమ తెరలు బిగించడానికి లేదా మంచాన్ని శోభనం మొదలైన శుభకార్యాల సమయంలో అలంకరించడానికి ఉపయోగిస్తారు.
  • హాస్పిటల్ మంచం : కొంత మంది మంచానికి రెండు వైపులా రైలింగ్ పైకి ఎత్తి పడుకుంటారు. ఇవి హాస్పిటల్ లో వ్యాధిగ్రస్తులు నిద్రలో క్రింద పడిపోకుండా ఆపుతుంది. వీటికి తల వైపు, కాళ్ళు వైపు అవసరం అయినప్పుడు పైకి క్రిందికి చేసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మంచం&oldid=3879964" నుండి వెలికితీశారు