మడపల్లి
మడపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చేజెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మడపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°31′29″N 79°33′26″E / 14.524694°N 79.557301°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | చేజెర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524341 |
ఎస్.టి.డి కోడ్ | 08628 |
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామం సరస్వతీ పుత్రుల గ్రామం. ఈ గ్రామంలో 94 మంది ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో 12 మంది విదేశాలలో స్థిరపడినారు. 1987 నుండి నేటివరకు, 112 మంది గురుకుల పాఠశాలలలో చదివిపట్టభద్రులైనారు. వీరు గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. వీరు ఈ రకంగా ఎదిగేందుకు, తల్లిదండ్రులలో గూడా విద్యపై శ్రద్ధ పెరిగేటందుకు కారణం, 1987లో ఏర్పాటయిన ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందమేనని, ఘంటాపథంగా చెప్పవచ్చు.