మణుగూరు
మణుగూరు (Manuguru), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన పట్టణం.[1] 2005, జూన్ 15న పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడింది.[2] 2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]
సింగరేణి కాలరీస్
మార్చుబొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం బండారుగూడెంను కూడా ప్రజలు మణుగూరు గానే పరిగణిస్తున్నారు.
విశేషాలు
మార్చుమణుగూరులో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్తులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ పరమేశ్వరునకు పూజలు నిర్వహిస్తున్నారు.మణుగూరు దగ్గరలో గోదావరి నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి భారజల కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్‌వే ఉంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్‌వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. అంజనేయ మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద ఉంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం ఉంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు, పోలీసు ఫైరింగ్ రేంజి కూడా ఉంది. ఈ ప్రదేశానికి దగ్గరలో సమ్మక్క సారలమ్మల గుడి ఉంది. ప్రక్కనే వున్న తోగ్గూడెంలో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని రేగులగండి అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడా ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీకి మారుపేరని ప్రతీతి. నేరాలు ఇక్కడ చాల తక్కువ.
ప్రయాణ సౌకర్యాలు
మార్చుమణుగూరు రైల్వే స్టేషను ఊరి పొలిమేరలలో వుంటుంది (6 కి.మీ.), ప్యాసింజెరు రైలు బయలుదేరే సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.మణుగూరు నుండి సూపర్ ఫాస్ట్ రైలు రాత్రి 9:30 కు సికింద్రాబాదుకు బయలు దేరుతుంది., రాత్రి 11:45 కు కాకతీయ పాసింజర్ బయలుదేరుతుంది.
04:30 | 22:15 | 17 hours 45 min | ||
0340 | మణుగూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్యాస్టు ప్యాసింజరు. | 21:15 | 13 hours 45 min | |
357 | మణుగూరు - కాజీపేట ప్యాసింజరు. | 06.30am |
మణుగూరు - సికింద్రాబాద్ సూపర్ ప్యాస్టు ఎక్స్‌ప్రెస్ 21:30 -12753.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Basic Information of Municipality, Manuguru Municipality". manugurumunicipality.telangana.gov.in. Retrieved 21 April 2021.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)