మద్దాలి గిరిధర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మద్దాలి గిరిధర్ రావు
మద్దాల గిరి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024 ఫిబ్రవరి 26
ముందు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1976
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సుబ్బా రావు
సంతానం మద్దాలి కృష్ణ వినూత్

రాజకీయ జీవితం మార్చు

మద్దాల గిరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి షేక్ మొహమ్మద్ ముస్తఫా చేతిలో 3151 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం పై 4289 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 డిసెంబర్ 30న టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు.[3] మద్దాలి గిరి 24 జనవరి 2020న గుంటూరు మిర్చి యార్డు గౌరవ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4]

మద్దాల గిరి టీడిపిని విడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[5][6]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. The News Minute (30 December 2019). "TDP legislator Maddali Giri, quits party, after meeting CM Jagan" (in ఇంగ్లీష్). Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  4. HMTV (27 January 2020). "గుంటూరు మిర్చి యార్డు గౌరవ అధ్యక్షుడిగా మద్దాలి గిరి". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  5. NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  6. Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.