మద్దికాయల ఓంకార్

ఓంకార్ గారి చరిత్ర ఆడియో

మద్దికాయల ఓంకార్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1972 - 1994
ముందు కే. ఎస్. రెడ్డి
తరువాత రేవూరి ప్రకాష్ రెడ్డి
నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1924
ఏపూరు గ్రామం, ఆత్మకూరు మండలం,సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 17 అక్టోబర్ 2008
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్, హైదరాబాద్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ యం.సి. పి.ఐ(యూ )
తల్లిదండ్రులు మద్దికాయల రామయ్య, అనంత లక్ష్మి
జీవిత భాగస్వామి మద్దికాయల లక్ష్మీ
సంతానం మద్దికాయల విజయ్‌కుమార్

మద్దికాయల అశోక్ ఓంకార్ మద్దికాయల సుధాకర్ డా .జ్యోతి

మతం నాస్తికుడు,

[1]

మద్దికాయల ఓంకార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్సంపేట నియోజకవర్గం నుండి 1972 నుండి 1989 వరకు ఎమ్మెల్యేగా గెలిచాడు.

మద్దికాయల ఓంకార్ 1924లో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం, ఏపూరు గ్రామం, మద్దికాయల రామయ్య, అనంత లక్ష్మి దంపతులకు జన్మించాడు.[1]

రాజకీయ జీవితం

మార్చు

మద్దికాయల ఓంకార్ 16 సంవత్సరాల వయస్సులోనే నిజాం నవాబ్ పాలన నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభలో 1944లో వాలెంటర్‌గా చేరాడు. ఆయన ప్రజలకు పోరాట చైతన్యాన్ని నూరిపోసి పోరాటంలో భాగస్వాములను చేస్తూ భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ అందుకొని సాయుధ పోరాటం చేశాడు.

ఓంకార్ ఉద్యమ కాలంలోనే సీపీఎం పార్టీలో చేరాడు. ఆయన పార్టీ అవసరాల రీత్యా వరంగల్ జిల్లాలో సీపీఎం నిర్మాణం కోసం పార్టీ ఆదేశాలకనుగుణంగా నర్సంపేటలో పని చేశాడు. ఓంకార్ 1972 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పెండెం కట్టయ్యపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఓంకార్ 1978 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గంటా ప్రతాప్ రెడ్డిపై, 1983లో కాంగ్రెస్ అభ్యర్థి పెండెం కట్టయ్యపై వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఓంకార్ సీపీఎం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో సీపీఎం నుండి బహిష్కరించింది. ఆయన తర్వాత 1985 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి (ఎంసీపీఐ పేరుతో) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మండవ ఉపేందర్ రావుపై, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏపూరు జనార్ధన్ రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి రేవూరి ప్రకాష్ రెడ్డి చేతిలో 87 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Mana Telangana (16 October 2019). "బహుజన రాజ్య స్థాపనే కామ్రేడ్ ఓంకార్‌కు నివాళి". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  2. Electionfate (2021). "Omkar Maddikayala". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.