మద్దిల గంగాధరరావు
మద్దిల గంగాధరరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. కటక్లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్‌ఫౌజ్ లో సైనికుడిగా పనిచేశారు.[1]
జీవిత విశెషాలు
మార్చుఆయన విశాఖపట్నం జిల్లా కోటవురట్ల శివారు మద్దిల గంగాధరరావులో 1915లో జన్మించారు. ఆయన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. 1937 లో కటక్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్‌ఫౌజ్'లో సైనికుడిగా పనిచేశారు. అనంతరం అహ్మదాబాద్‌లో మిలటరీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన యుద్ధాల్లోనూ తన సేవలందించారు. 1967, 1971లలో రాష్ట్రపతి అవార్డులతో సహా మొత్తం 11 పురస్కారాలు అందుకున్నారు. 1974లో ఉద్యోగ విరమణ చేశారు.[2]