మద్దూరి వెంకటేశ్వర యాజులు
మద్దూరి వెంకటేశ్వర యాజులు (జూలై 13, 1927 - సెప్టెంబర్ 18, 2018) సుప్రసిద్ధ వేతశ్రౌత విద్వాంసులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆగమ సలహాదారుడు. శతాధిక సోమ, స్మార్త యాగాల్ని నిర్వహించాడు.[1]
మద్దూరి వెంకటేశ్వర యాజులు | |
---|---|
జననం | జూలై 13, 1927 |
మరణం | సెప్టెంబర్ 18, 2018 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | వేతశ్రౌత విద్వాంసులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆగమ సలహాదారుడు |
తల్లిదండ్రులు | యజ్ఞ నారాయణ సోమయాజి, సుబ్బమ్మ సోమిదేవమ్మ |
బంధువులు | వెంటకలక్ష్మి సోమిదేవి (భార్య) |
జననం
మార్చువెంకటేశ్వర యాజులు 1927, జూలై 13న యజ్ఞ నారాయణ సోమయాజి, సుబ్బమ్మ సోమిదేవమ్మ దంపతులకు కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో మద్దూరి ఆయన జన్మించాడు.[2]
వైదిక ప్రస్థానం
మార్చుమద్దూరి వంశంలో 15వ తరంవాడైన వెంకటేశ్వర యాజులు ఇప్పటివరకు 15కు పైగా సోమయాగాలు, 600లకు పైగా ఆలయాల ప్రతిష్ఠలను, వందలాది ఇతర యాగాలను నిర్వహించాడు. శ్రీశైలం, కాళహస్తి, అమరావతి, తిరుపతి, వేములవాడ, మైసూర్, గోకర్ణ, బళ్ళారి, కంచి, రామేశ్వరం, నాసిక్, సోమనాథ్, ఉజ్జయిని, ఓంకారం, అయోధ్య, బదరీనాథ్, నైమిశారణ్యం, వైద్యనాథం, ఖాట్మండులలో మహాకత్రువలను నిర్వహించాడు.
ఇతర వివరాలు
మార్చు- 1962 నుంచి 1969 వరకు జుజ్జూరు గ్రామ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేశాడు.
- 1970 నుంచి 1987 వరకు జుజ్జూరు గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు.
మరణం
మార్చు2018, సెప్టెంబర్ 12న కుటుంబసభ్యులతో కలిసి చార్ ధామ్ యాత్రకు బయలుదేరిన వెంకటేశ్వర యాజులు అనారోగ్యానికి గురై, సెప్టెంబర్ 18 (మంగళవారం)న బదరీనాథ్ క్షేత్రంలోతుదిశ్వాస విడిచాడు.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ (19 September 2018). "మద్దూరి వెంకటేశ్వర శివైక్యం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Archived from the original on 19 September 2018. Retrieved 19 September 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (19 September 2018). "ఆహితాగ్ని సార్వభౌమ మద్దూరి వెంకటేశ్వర యాజులు శివైక్యం". Archived from the original on 19 September 2018. Retrieved 19 September 2018.