మద్నూర్ మండలం (కామారెడ్డి జిల్లా)
మద్నూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
మద్నూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మద్నూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°30′00″N 77°38′00″E / 18.5000°N 77.6333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | మద్నూర్ (కామారెడ్డి) |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,002 |
- పురుషులు | 29,957 |
- స్త్రీలు | 29,045 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.99% |
- పురుషులు | 57.62% |
- స్త్రీలు | 32.10% |
పిన్‌కోడ్ | 503309 |
ఇది సమీప పట్టణమైన డెగ్లూర్ (మహారాష్ట్ర) నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం మద్నూర్.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:59,002 - పురుషులు:29,957 - స్త్రీలు: 29,045; అక్షరాస్యత - మొత్తం: 44.99% - పురుషులు:57.62% - స్త్రీలు:32.10%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 235 చ.కి.మీ. కాగా, జనాభా 59,002. జనాభాలో పురుషులు 29,957 కాగా, స్త్రీల సంఖ్య 29,045. మండలంలో 12,511 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అంతాపూర్
- అవ్వల్‌గావ్
- చిన్న షక్కర్గ
- చిన్న తడ్గూర్
- ధనూర్
- చిన్న ఎక్లార
- గోజేగావ్
- కేలూర్
- ఖరగ్
- కోడ్చెర
- లాచన్
- మద్నూరు
- మెనూర్
- పెద్ద ఎక్లార
- పెద్ద షక్కర్గ
- పెద్ద తడ్గూర్
- రాచూర్
- రూసేగావ్
- సలాబత్‌పూర్
- షేఖాపూర్
- సోమూర్
- సోనాల
- సుల్తాన్‌పేట్
- తడి హిప్పెర్గ
గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.