మధుకర్ పిచాడ్
మధుకర్ కాశీనాథ్ పిచాడ్ (1941 జూన్ 1-2024 డిసెంబర్ 6) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త మహారాష్ట్ర ప్రభుత్వం లో మధుకర్ పిచాడ్ మంత్రి గా పని చేశాడు .[1][2] 1980 నుండి 2009 అకోలే అసెంబ్లీ నియోజకవర్గం నుండి మధుకర్ పిచాడ్ ఏడు సర్లు ఎమ్మెల్యేగా గెలిచాడు .మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. 1995 మార్చి నుండి 1999 జూలై వరకు మధుకర్ పిచాడ్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.[3][4]
మధుకర్ పిచాడ్ | |
---|---|
मधुकर काशिनाथ पिचड | |
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు | |
In office 1980–2014 | |
అంతకు ముందు వారు | యశ్వంత్ భార్గవ్ |
తరువాత వారు | వైభవ్ మధుకర్ పిచాడ్ |
నియోజకవర్గం | అకోల్ శాసనసభ నియోజకవర్గం |
మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు | |
In office 1995–1999 | |
అంతకు ముందు వారు | గోపీనాథ్ ముండే |
తరువాత వారు | నారాయణ్ రాణే |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అకోల్ , అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | 1941 జూన్ 1
మరణం | 2024 డిసెంబరు 6 | (వయసు 83)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు |
|
సంతానం | 3 |
తల్లిదండ్రులు | కాశీనాథ్ పిచాడ్ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
మధుకర్ పిచాడ్ తన రాజకీయ జీవితాన్ని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించాడు, 2019 లో మధుకర్ పిచాడ్ తన కుమారుడు వైభవ్ పిచాడ్ కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. తరువాతభారతీయ జనతా పార్టీ లో చేరారు.[5][6] మధుకర్ పిచాడ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.[7]
మధుకర్ పిచాడ్ 1961లో అమృతసాగర్ మిల్క్ కో-ఆపరేటివ్ అకోలే అనే పాల ఉత్పత్తి సంస్థను స్థాపించారు.[8] 1993లో స్థాపించబడిన భారతదేశంలోని మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారం అయిన అగస్తి సహకారి చక్కెర ఫ్యాక్టరీకి మధుకర్ పిచాడ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.[9]
జీవితం వృత్తి
మార్చుమధుకర్ పిచాడ్ 1941 జూన్ 1న మహదేవ్ కోలి అనే గిరిజన కుటుంబంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రాజూర్ లో కాశీనాథ్ పిచాడ్ కమల బాయి దంపతులకు జన్మించాడు మధుకర్ పిచాడ్ తండ్రి కాశీనాథ్ పిచాడ్ ఉపాధ్యాయుడు.[10][3]
మధుకర్ పిచాడ్ పూణే లోని ఫెర్గూసన్ కళాశాల నుండి బి. ఎ. ఎల్ ఎల్ బి పూర్తి చేశాడు, అక్కడ మధుకర్ పిచాడ్ విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించాడు.[3]
1972లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికైన తరువాత మధుకర్ పిచాడ్ తన వృత్తిని ప్రారంభించాడు, 1972లో పంచాయతీ సమితి అకోలే తాలూకా ఛైర్మన్ గా 1980 వరకు పనిచేశాడు.
మరణం
మార్చుమధుకర్ పిచాడ్ 2024 డిసెంబర్ 6న అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.
- ↑ "Mumbai News: Sharad Pawar Blames Eknath Shinde's Govt For Jalna Lathi Charge". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "Vaibhav Pichad confirms his entry in BJP". The Asian Age. 2019-07-28. Retrieved 2023-12-02.
- ↑ ఇక్కడికి దుముకు: 3.0 3.1 3.2 ब्युरो, सरकारनामा (2017-06-01). "आजचे वाढदिवस, मधुकरराव पिचड,शिवाजीराव कर्डिले". Politics News on Sarkarnama (in మరాఠీ). Retrieved 2024-09-11. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Pandit, Vivek (2000). Fearless Minds: Rights Based Approach to Organizing and Advocacy (in ఇంగ్లీష్). National Centre for Advocacy Studies. p. 227.
- ↑ "NCP, Congress leaders including Sandeep Naik, Chitra Wagh, Vaibhav Pichad, Madhukar Pichad join BJP". Mumbai Mirror (in ఇంగ్లీష్). 31 July 2019. Retrieved 2023-12-02.
- ↑ "Ahmednagar: Veteran BJP leader Madhukar Pichad, son Vaibhav lose in Agasthi sugar factory election". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "NCP MLA Vaibhav Pichad to join BJP". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-07-28. Retrieved 2023-12-02.
- ↑ "'अमृतसागर' पिचड यांचाच". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2024-09-18.
- ↑ "साखर उताऱ्यात 'अगस्ती' प्रथम". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2024-09-18.
- ↑ Marathi, TV9 (2019-07-27). "आघाडीची सत्ता पुन्हा येणार नाही, जनतेसाठी भाजपात जातोय : वैभव पिचड". TV9 Marathi (in మరాఠీ). Retrieved 2024-09-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "भाजपचे ज्येष्ठ नेते, माजी मंत्री मधुकर पिचड यांचे निधन:वयाच्या 84 व्या वर्षी घेतला अखेरचा श्वास, सलग 7 वेळा राहिले आमदार". divyamarathi.bhaskar.com. 6 December 2024. Retrieved 6 December 2024.