కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు పట్టణానికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది ఈ మధుగిరి కోట, సుమారు మూడున్నర వేల అడుగుల ఎత్తైన ఏకశిలా పర్వతాన్ని కలుపుకొని ఈ కోట నిర్మించ బడింది. మొదట్లో దీన్ని మధు అని పిలిచేవారు. కాలానుగుణంగా మద్గరి.....మద్దగిరి అనే పేర్లు వచ్చాయి. మైసూరు రాజులు ఈ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్న తరువాత దీనికి "ప్రసన్న గిరి" అని పేరు పెట్టారు. హైదర్ అలీ మైసూర్ సంస్థానాధీశుడైన తరువాత దీనికి "పతేబాద్" అని పేరు మార్చాడు. అక్కడ లభించిన శాసనాలను బట్టి దీనికి కృష్ణ గిరి... మాధవ గిరి అని పేర్లున్నట్లు తెలుస్తున్నది. ఆంగ్లేయుల కాలంలో దీన్ని "మద్దగిరి" అని పిలిచే వారు. ఆంగ్లేయులు ఆ పేరును సరిగా పలకలేనందున 1927 వ సంవత్సరంలో అక్కడ ఆంగ్లేయుల అధికారిగా పనిచేసిన మాస్తి వెంకటేష్ అనే సుప్రసిద్ద కన్నడ కవి దీనికి "మధుగిరి" అని స్థిరమైన నామకరణం చేశాడు. ఈ పర్వతం ఆసియా లోనే అతి పెద్ద ఏకశిలా పర్వతమని స్థానికులంటారు. కొండ పైన విశాల ప్రదేశం తియ్యటి నీటి కొలనులు, ఉన్నాయి. పైకి ఎక్కడానికి మెట్లదారి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాన్ కాలంలో మరింత భద్రంగా తీర్చి దిద్దాడు. కోట గోడలు, బురుజులు ఇప్పటికి చెక్కుచెదర లేదు. కోటకు ఆనాడు నిర్మించిన అంతరాళ ద్వారం, దిడ్డివాకిలి, మైసూరు వాకిలి అనేవి నేటికి పతిష్టంగా ఉన్నాయి. ద్వారాలకు తలుపులు మాత్రం సిధిలమైనాయి. కోట లోపల చానయ్యన బావి, అరసన బావి, ప్రధాన బవి, దేవరాయ సముద్రం లాంటి పేర్లతో అనేక ఊట బావులున్నాయి. అవన్ని మంచి శిల్పకళాకృతులే గాక అందులోని నీరు చాల తియ్యాగా ఉన్నాయి. కోట వెలుపల ఆనాడు అత్యంత సుందరంగా నిర్మించిన రెండు పుష్కరణిలు ఈనాటికి చెక్కు చెదర కుండా ఉన్నాయి. కొండ దిగువనుండి కోట లోపలికి ప్రవేశించి కొండ పైకి వెళ్లాలంటే 15 కోట ద్వారాల నుండి వెళ్ళాల్సి వుంటుంది. ఈ కోట వైశాల్యం సుమారు 232 ఎకరాలుంటుంది. కోట లోపల కొన్ని ఆలయాలలోను, శిథిల మందిరాల లోను నిధుల కోసం ఇటీవల దుండగులు కొందరు రహస్యంగా త్రవ్వకాలు సాగించారు. ఆ కారణంగా కొన్ని కట్టడాలు శిథిలమైనాయని స్థానికులు చెప్తున్నారు.[1]

మూలాలు

మార్చు

madhugiri kota కోసం చిత్రాలు

  1. (మూలం: ఈనాడు: ఆదివారం: 24 నవంబరు 2002)

యితర లింకులు

మార్చు