మధులికా గుహాతకుర్త
డా.మధులికా గుహాతకుర్త అంతరిక్ష పరిశోధకురాలు. ప్రధానంగా సౌరవ్యవస్థ పరిశోధకురాలు.
బాల్యం - విద్యాభ్యాసం
మార్చుఈమె కోల్‌కతాలో జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఆస్ట్రో ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తదనంతరం అమెరికా వెళ్ళి డెన్వర్ యూనివర్శిటీ, కొలరాడో యూనివర్శిటీలలో పి.హెచ్.డిలు సాధించారు. ఈమె పరిశోధనా ప్రతిభాశక్తిని గ్రహించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఆహ్వానించింది.
శాస్త్రవేత్తగా
మార్చుడాక్టర్ మధులికా "నాసా" ప్రతిష్ఠాత్మకంగా తాము చేపట్టిన సౌర పరిశోధనల కోసం ఉద్దేశించిన "Living with a star" ( ఒక నక్షత్రంతో సహజీవనం) కార్యక్రమాన్ని అప్పగించారు. అనతి కాలంలోనే ఆ ప్రోగ్రాంకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. అగ్ని జ్యాలలు విరజిమ్మే ప్రచండ భానుడి వద్దకు ఏకంగా ఉపగ్రహాలను పంపే గురుతర బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు.
శాస్త్రవేత్తగా, మిషన్ డిజైనర్, పరికరాల రూపకర్త, శాస్త్రీయ పరిశోధనలు పర్యవేక్షరాలిగా, "నాసా"లో కొత్తగా చేరిన వారికి శిక్షకురాలిగా, "నాసా" అధికార ప్రతినిధూలలో ఒకరిగా - ఇలా బహుముఖ పాత్రలలో చక్కగా ఇమిడిపోయిన డాక్టర్ మధులికను అక్కడి వారందరూ అప్యాయతతో "లైకా"గా వ్యవహరిస్తుంటారు. అవసరమైన కొన్ని సందర్భాలలో ఈమె ఒకే రోజున ఈ పాత్రలన్నీ సజావుగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంటారని "నాసా" ఈమెకు కితాబునిచ్చింది. "తారా పధాన" నిలిచిన ఈమె ఒక భారతీయురాలు కావడం దేశానికి గర్వకారణమైంది. తారలమీద గాఢ పరిశోధనలు జరుపుతున్న మధులిక "నాసా"లో ఒక తారగా వెలుగొందుతోంది.
పరిశోధనలలో ముఖ్యాంశాలు
మార్చుమన సౌర వ్యవస్థ మధ్యలో ఒక సాధారణ, అయస్కాంత అస్థినక్షత్రంఉంది. అదే సూర్యుడు! మనం నివసించే అంతరిక్షంలో ప్రతి ఒక్క చదరపు అంగుళానికి ఆ నక్షత్రమే మహా చక్రవర్తి. భూమి మీద ప్రాణకోటికి ఆ నక్షత్రంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ కారణంతో దాని అస్థిత్వాన్ని కచ్చితమైన రీతిలో సదవగాహన చేసుకొని భవిష్యత్ చిత్రాన్ని ముందుగానే ఆవిష్కరించుకోవడానికి మనం సూర్యుని మీద పరిశోధనలు సాగించవలసి ఉంది. ఈ సందర్భంగానె "నాసా" ఈ కార్యక్రమం "లివింగ్ విత్ ఎ స్టార్ (LWS)"ను చేపట్టింది. 2008 ప్రథమార్థంలో ఈ కార్యక్రమం నకు ఈమె చేతనే శ్రీకారం చుట్టించడం విశేషం.
డాక్టర్ మధులిక ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన తర్వాత సూర్యుని మీద ప్రాథమిక పరిశోధనలు నిర్వహించి కొన్ని ఫలితాలను సాధించారు. సౌర తుఫాన్లు, సూర్యును నుంచి భారీ స్థాయిలో అనేక పదార్థాల విడుదల (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) సమయంలో భూమి మీద ఎలక్ట్రానిక్, విద్యుత్ వ్యవస్థలు, భూకక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు నష్టం వాతిల్లుతున్న సందర్భంలో వీటిని అధికమించేందుకు ఈమె పరిశోధనా ఫలితాలు మౌలికంగా కొంతమేర ప్రయోజనకరం కాగలిగాయి.
డాక్టర్ మధులికా అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయటానికి "హీలియో ఫిజిక్స్" పేరుతో ఒక వినూత్న శాస్త్ర విభాగాన్ని ఆవిష్కరించి, దీని ద్వారా సూర్య గ్రహం మీద విస్తృత పరిశోధనలు ప్రరంభించారు. అనేక మార్పులకు లోనవుతున్న సూర్య గ్రహం, సౌర కుటుంబం మీద దాని ప్రభావాన్ని అంచనా వేయడానికే డాక్టర్ మధులిక పరిశోధనలు కొనసాగించారు.
2008, ఆఖరి నలల్లో "నాసా" ఈ పరిశోధనలు ఆలంబనగా మరో ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం "సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ" (SDO). ఈ పరిశోధన కార్యక్రమం ద్వారా సూర్యునిలో మార్పులకు కారణాలను, భూమండలం మీద వాటి ప్రభావం మొదలైన అంశాలను శోధించింది. "ఎస్.డి.ఓ" (SDO) అనేది ఒక వ్యోమనౌక. ఇది ఒకే సమయంలో అనేకానేక తరంగ దైర్ఘ్యాలలో సౌర వాతావరణాన్ని పరిశీలించింది. సౌర మార్పులను ముందుగానే భూమికి తెలియజెప్పే హెచ్చరిక వ్యవస్థల రూపకల్పనకు ఇది దోహదం చేసింది. అసలు సూర్యగ్రహంలో అయస్కాంతక్షేత్రం ఎలా ఏర్పడుతోంది, సూర్యమండలంలో అయస్కాంత శక్తి, సౌరవాయువులు, శక్తిమంతమైన పదార్థాలుగా మారి అంతరిక్షంలోకి విడుదలవుతున్న తీరుతెన్నులు మొదలైఅన్ అంశాలను నిగ్గు తేల్చడానికి ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. ఈ కార్యక్రమంలో మధులిక ముఖ్య పాత్ర పోషించారు.
పరిశోధనలు
మార్చుడాక్టర్ మధులిక చేస్తున్న పరిశోధనల వివరాలు సంక్షిప్తంగా ఇవి. ఈమె ప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త రాబ్ గిల్పార్డ్ ను వివాహం చేసుకున్నారు. ఈమె అంతర్జాతీయ సైన్స్ మేగజైన్ లలో 70 కి పైగా తమ పరిశోధనా వ్యాసాలను వెలువరించారు[1]. ప్రవాస భారతీయ శాస్త్రవేత్తగా మన దేశానికి ఘన కీర్తిని తెచ్చిన ఈమె కృషి ఈషణ్మాత్రం.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-22. Retrieved 2013-12-26.