మనసు గతి ఇంతే ఆచార్య ఆత్రేయ రచించిన సినిమా పాటల సంకలనం.

మనసు గతి ఇంతే
మనసు గతి ఇంతే పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: సంజయ్ కిషోర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సినీ సాహిత్యం
ప్రచురణ: సంగమ్ అకాడెమీ, హైదరాబాద్
విడుదల: ఆగష్టు 2007
పేజీలు: 288 పేజీలు

దీనిని సంజయ్ కిషోర్ సేకరించగా సంగమ్ అకాడెమీ వారు 2007 సంవత్సరంలో ముద్రించారు.

దీనిలో ఆత్రేయ మొదటిసారిగా 1951లో దీక్ష సినిమా కోసం రాసిన పోరా బాబూ పో మొదలుకొని 1990 లో నారీ నారీ నడుమ మురారి వరకు అనగా సుమారు 40 సంవత్సరాల కాలంలో రాసిన 242 మంచి తెలుగు పాటలు ఉన్నాయి. ఇందులో సుమారు 123 సినిమాల నుండి పాటల వివరాలు తెలియజేయబడ్డాయి.

ఈ పుస్తకంలోని పాటల్ని సేకరించిన సంగమ్ సంజయ్ కిషోర్ ఆత్రేయ గురించి ఇలా వివరించారు :

"తేలికైన పదాలతో బరువైన భావాన్నిచెప్పి తెలుగు సినిమా పాటను, తెలుగు సినీ ప్రేక్షకుడిని కదిలించిన కవి శ్రీ ఆచార్య ఆత్రేయ. అలాగే మనసును ఆత్రేయ గారు చూసినన్ని కోణాలలో ఏ రచయితా చూడలేదేమో ! అందుకే తెలుగు సినిమా పాటకు మనసు అంటే ఆత్రేయ.. ఆత్రేయ అంటే మనసే !"

సినిమాలు మార్చు

ఇందులో ఉన్న పాటలు ఈ క్రింది సినిమాలలోనివి.

దీక్ష, అర్ధాంగి, తోడికోడళ్ళు, ముందడుగు, పెళ్ళికానుక, శ్రీ వెంకటేశ్వర మహత్యం, ఇంటికి దీపం ఇల్లాలు, మంచి మనసులు, సిరిసంపదలు, మంచీ చెడు, ఆత్మబలం, గుడిగంటలు, డాక్టర్ చక్రవర్తి, దాగుడు మూతలు, మురళీకృష్ణ, మూగ మనసులు, శభాష్ సూరి, అంతస్థులు, ఆడబ్రతుకు, తేనె మనసులు, తోడూ నీడ, ప్రేమించి చూడు, మనుషులు మమతలు, సుమంగళి, ఆస్తిపరులు, కన్నె మనసులు, మనసే మందిరం, కంచుకోట, బ్రహ్మచారి, కలసిన మనసులు, అదృష్టవంతులు, నాటకాల రాయుడు, సిపాయి చిన్నయ్య, అక్కాచెల్లెలు, దసరాబుల్లోడు, ప్రేమనగర్, భార్యాబిడ్డలు, మట్టిలో మాణిక్యం, శ్రీకృష్ణ విజయం, కొడుకు కోడలు, పాపం పసివాడు, బడిపంతులు, విచిత్రబంధం, జీవన తరంగాలు, దేశోద్ధారకులు, పల్లెటూరి బావ, బంగారు బాబు, భక్త తుకారాం, మమత, మాయదారి మల్లిగాడు, మైనరు బాబు, చక్రవాకం, తోటరాముడు, ప్రేమలు పెళ్ళిళ్ళు, బంగారు కలలు, మంచి మనుషులు, అమ్మాయిల శపథం, గాజుల కిష్టయ్య, చిల్లర దేవుళ్లు, పండంటి సంసారం, జేబుదొంగ, అంతులేని కథ, చక్రధారి, ఈ తరం మనిషి, జ్యోతి, మన ఊరి కథ, సెక్రెటరీ, అమరదీపం, ఇంద్రధనస్సు, బంగారు బొమ్మలు, భలే అల్లుడు, రాజా రమేష్, కె.డి.నెంబర్ 1, చిలిపి కృష్ణుడు, పొట్టేలు పున్నమ్మ, మరోచరిత్ర, అందమైన అనుభవం, జూదగాడు, ఇది కథ కాదు, కోరికలే గుర్రాలైతే, గుప్పెడు మనసు, డ్రైవర్ రాముడు, ఒక చల్లని రాత్రి, కక్ష, గురు, ఛాలెంజ్ రాముడు, ప్రేమ తరంగాలు, రామ్ రాబర్ట్ రహీమ్, సంధ్య, ఆకలిరాజ్యం, ఇల్లాలు, గురుశిష్యులు, తొలి కోడి కూసింది, పులిబిడ్డ, రామదండు, అనురాగదేవత తోడు నీడ, త్రిశూలం, దేవత, అభిలాష, కోకిలమ్మ, పెళ్ళిచూపులు, రాజకుమార్, శ్రీరంగనీతులు, అనుబంధం, మానసవీణ, మహామనిషి, నిరీక్షణ, పండంటి కాపురానికి 12 సూత్రాలు, మంచిమనసులు, సీతారామ కళ్యాణం, స్వాతిముత్యం, షిర్డీ సాయిబాబా మహత్యం, ఆత్మబంధువు, డబ్బెవరికి చేదు, అభినందన, ఆరాధన, జానకి రాముడు, ప్రేమ, నీరాజనం, సింహస్వప్నం, నారీ నారీ నడుమ మురారి

బయటి లింకులు మార్చు