శ్రీకృష్ణ విజయం

శ్రీకృష్ణ విజయం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎం.ఎస్. రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
జమున,
ఎస్.వి. రంగారావు,
కాంతారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కౌముదీ పిక్చర్స్ (తారకరామ పిక్చర్స్?)
భాష తెలుగు

పాత్రలు, పాత్రధారులు మార్చు

 • శ్రీకృష్ణుడు - ఎన్.టి.రామారావు
 • సత్యభామ - జమున
 • వసుంధర - జయలలిత
 • నారదుడు - కాంతారావు
 • కుచేలుడు - మద్దాలి కృష్ణమూర్తి
 • పౌండ్రక వాసుదేవుడు - నాగభూషణం

ఇంకా ఇందులో రామకృష్ణ, పద్మనాభం, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజనాల, దేవిక, సంధ్యారాణి, రమాప్రభ తదితరులు నటించారు.

పాటలు మార్చు

 1. అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణపరమాత్మ సేవకు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
 2. అడిగితి నొక్కనాడు నేనడిగితి ఒక్కనాడు కమలాసను (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
 3. అనరాదే బాలా కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన - ఘంటసాల, జయలలిత - రచన: సినారె
 4. అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే (పద్యం) - ఘంటసాల
 5. అంకిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి నొనర్చి శంభు (పద్యం) - మాధవపెద్ది
 6. అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆఙ్ఞ (పద్యం) - మాధవపెద్ది
 7. ఓరీ యాదవా నీ ప్రగల్భములు మాయోపాయజాలములు (పద్యం) - మాధవపెద్ది
 8. జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - ఘంటసాల - రచన: దాశరథి
 9. జయతు జయతు దేవి దేవసంధావి (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల బృందం
 10. జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు రసరమ్య గుణశాలి వనమాలి - పి.సుశీల
 11. జేజేల తల్లికి జేజేలు మా గౌరమ్మ పెళ్ళికి బాజాలు - సుశీల బృందం
 12. పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
 13. పలువా ప్రేలకుమింక పండినది నీ పాపములు ఈనాడు (పద్యం) - మాధవపెద్ది
 14. పనివడి నీవు కోరినటు భట్టులో పెను భట్టులో (పద్యం) - ఘంటసాల
 15. భళిరే మేల్ మేల్ మదిలోని భావమెల్ల హాయి హాయీ (పద్యం) - మాధవపెద్ది
 16. నా జీవితము నీకంకితము నీవే నాకు ఆలంబనము - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
 17. నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన చెప్పవే ప్రయమురళీ - ఘంటసాల, సుశీల
 18. మరచినావేమో నీయన్న మమ్మెదిరించి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
 19. రత్నములవంటి అష్ట భార్యలకు తోడు సోయగము (పద్యం) - ఘంటసాల - రచన: ముదివర్తి
 20. రమణీ ఓ రమణీ నా తప్పు మన్నింపరానిదేని రట్టు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
 21. హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి - సుశీల

మూలాలు మార్చు


 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.