మనసు ఫౌండేషన్

స్వచ్చంద సంస్థ

మనసు పౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ. దీనిని ఎం.వి.రాయుడు, వారి సోదరులు మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి స్థాపించారు. తమ తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మల పేర్లలో మ.న.సు. అన్న అక్షరాలు తీసుకుని పేరుపెట్టారు. మనసు ఫౌండేషన్ ప్రధానంగా తెలుగు పుస్తక ప్రచురణ, తెలుగు సాహిత్య డిజిటైజేషన్ రంగాల్లో పనిచేస్తోంది.

మన్నం వెంకటరాయుడు, మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరు

స్థాపన మార్చు

మనసు అనేది వారి తల్లిదండ్రులపేరున అనగా మన్నం నరసింహం, సుబ్బమ్మ పేరున ( మన్నం నుండి నరసింహరావు సుబ్బమ్మ నుండి సు) స్థాపించారు. దీని కార్యాలయం బెంగళూరులో 2006 లో ప్రారంబించారు. కాని కార్యకలాపాలు మునుపు హైదరాబాద్ కేంద్రంగానూ ప్రస్తుతం గుంటూరు కేంద్రంగానూ సాగిస్తున్నారు.

దీనిని ముగ్గురు అన్నదమ్ములైన మన్నం వెంకట రాయుడు, డాక్టర్ మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళిలు నడుపుతున్నారు.

కార్యక్రమాలు మార్చు

 
మన్నం వెంకటరాయుడు

ఫౌండేషన్ లక్ష్యాలు: మనసు ఫౌండేషన్ అనేక ఇతర కార్యక్రమాలతో పాటు పుస్తక ప్రచురణ రంగం లో పనిచేస్తుంది.[1]

ఈ రంగం లో ఫౌండేషన్ కి స్థూలంగా రెండు లక్ష్యాలు ఉన్నాయి.

1. తెలుగు భాషను సుసంపన్నం చేసిన గొప్ప రచయితల సంపూర్ణ రచనల సర్వస్వాన్ని ప్రచురించి కొత్త తరం పాఠకులకు అందించడం. ఆయా రచయితల రచనలు కాల గర్భంలో కలసిపోకుండా పరిరక్షించి భావి తరాలకి అందించడం. అలాగే ఒక రచయిత రచనల్ని ఒక చోటికి తీసుకు రావడం ద్వారా, ఆ రచయిత సాహిత్యం మీద పరిశీలన, పరిశోధన, విశ్లేషణ చేయదలచుకొన్న వారికి అందుబాటులో ఉంచడం. తద్వారా అయా రచనల పునర్ మూల్యాంకనానికి తోడ్పడటం.

2.19వ శతాబ్దానికి పూర్వం తెలుగు సమాజాన్ని ప్రతిఫలించిన రచనల్ని వెలుగులోకి తీసుకొని రావడం ఫౌండేషన్ రెండవ లక్ష్యం. ముఖ్యంగా ఆనాటి సమాజాన్ని చిత్రించిన,విశ్లేషించిన ఇంగ్లీషు రచనల్ని తెలుగులోకి తీసుకొని రావటం.

ఈ చిత్రపురి

"ఈ-చిత్రపురి" తెలుగు సినిమాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించి తెలుగు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మొదలు పెట్టిన ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలుగు సినిమా పాటల పుస్తకాలను, పత్రికలను, ఆడియోలను, వీడియోలను, ఛాయాచిత్రాలను సేకరించి, డిజిటీకరించే పనికి శ్రీకారం చుట్టింది. తెలుగులో అచ్చయిన పుస్తకాలను అందుబాటులో ఉన్నంత వరకు సేకరించి, కంప్యూటర్లలో భద్రపరచి భావి తరాలకు అందించటం ఒక మహాయజ్ఞం. ఈ పని కోసం నెల్లూరు జిల్లా కనియంపాడు (వరికుంటపాడు మండలం) కేంద్రంగా మనసు ఫౌండేషన్ డిజిటైజేషన్ సెంటర్ ను నడుపుతోంది. ఇప్పటి వరకు పుస్తకాలు, పత్రికలు కలిపి దాదాపు 40 లక్షల పేజీల డిజిటీకరణ పూర్తయింది.

తెలుగులో అచ్చయిన లేదా చేతివ్రాత లో ఉన్న పుస్తకాలను మనసు ఫౌండేషన్ అందరినుండి సేకరించి, స్కానింగ్ కోసం తీసుకుని, వాటిని స్కాన్ చేసి తిరిగి యధాతథంగా తిరిగి వాపసు ఇస్తోంది.

పుస్తక ప్రచురణలు మార్చు

సాహిత్య సర్వస్వాలు, సర్వలభ్య సంకలనాలు మార్చు

 • రావి శాస్త్రి రచనా సాగరం (2007)
 • కాళీపట్నం రామారావు రచనలు (2008)
 • శ్రీ శ్రీ ప్రస్థానత్రయం (2010)
 • బీనా దేవి సమగ్ర రచనలు(2011)
 • గురజాడలు(2012),
 • పతంజలి సాహిత్యం(2012),
 • జాషువా సర్వ లభ్య రచనలు(2013),
 • శ్రీ పాద సుబ్రహ్మణ్యం శాస్త్రి సర్వ లభ్య రచనలు (2015),
 • పాతికేళ్ల తెలుగు కథ (2016)
 • పఠాభి రచనలు (2018)

అనువాదాలు మార్చు

 • చెప్పులు కుడుతూ కుడుతూ (2008)
 • సర్ ఆర్థర్ కాటన్ జీవితం-కృషి (2011)

ఇతర రచనలు మార్చు

 • మార్గదర్శి మన పంతులు గారు (2011)

విశేషాలు మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

 1. సీహెచ్., వేణు. "సాహిత్యంపై'మనసు'నిస్వార్థ తపస్సు". తెలుగు వెలుగు. Archived from the original on 2020-10-04. Retrieved 2020-10-04.