మనుస్మృతి

మనుధర్మశాస్రం

మనుస్మృతి పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అంటారు. క్రీస్తు పూర్వం 200 - క్రీస్తు శకం 200 మధ్య మను అను ఋషి వ్రాశాడు. మనుస్మృతిని మొదటిసారిగా 1776 లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంలో తర్జుమా చేశాడు. ఇది లో ఆంగ్లంలోకి అనువదించబడిన మొదటి సంస్కృత గ్రంథాలలో ఇది ఒకటి [1] ఈ శాస్త్రంలో ఆదిమానవుడైన మను వివిధ వర్ణాలకు చెందిన ఋషులతో సమస్త విషయాలు బోధించినట్లు చూస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనుస్మృతి బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం.

Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya

హిందూ ధర్మ శాస్త్రాలలో మనుధర్మ శాస్త్రం ఒకటి. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ, సామాజిక, మతపరమైన నియమాలు  

కొన్ని ముఖ్యమైన విషయాలుసవరించు

 • బ్రాహ్మణులను వేద పండితులు, గురువులుగా, క్షత్రియులు పరిపాలకులుగా, వైశ్యులు వ్యాపారులు, వ్యవసాయదారులుగా, శూద్రులు సేవకులుగా ఆశీర్వదించాడు మనువు.
 • 8 సంవత్సరాల బ్రాహ్మణుడికి, 11 సంవత్సరాల క్షత్రియుడికి, 12 సంవత్సరాల వైశ్యుడుకి ఉపనయనం జరుపవలెను.
 • గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపము, తండ్రి ప్రజాపతి రూపము, తల్లి భూదేవి రూపము, పెద్ద సోదరుడు తన స్వరూపము.
 • స్త్రీలు తమ సోదరుల చేతను, తండ్రుల చేతను, భర్తల చేతను, మరుదుల చేతను గౌరవించబడవలెను, ఆరాధించబడవలెను.
 • స్త్రీలు గౌరవింపబడిన చోట దేవుళ్ళు ఆనందించుదురు. గౌరవింపబడనిచోట ఎటువంటి కార్యాలు చేసినా ఫలితము ఉండదు.
 • స్త్రీలు బాధపడిన కుటుంబము సర్వనాశనమవుతుంది. వారు సంతోషించిన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది.
 • పురుషులు తమ క్షేమం కోసం వస్త్రములతోను, ఆభరణములతోను, స్త్రీలను గౌరవించాలి.
 • భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఆనందించిన కుటుంబము కలకాలం వర్ధిల్లుతుంది.
 • ఇంటి పనుల్లోను, గృహోపకరణాలు శుభ్రపరచుటలోను, ఆర్థిక విషయాల్లో స్త్రీ తెలివిగా, చురుకుగా ఉండాలి.

ఇతర విషయములుసవరించు

స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేఖించాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా కొందరి చేత వ్రాయబడినదని కొందరు అభిప్రాయబడ్డారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని వారు అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది.మనువు బైబిల్లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.[2]. స్టార్ మా టివిలో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.

ఇంకా చదవండిసవరించు

లంకెలుసవరించు

http://sanskritdocuments.org/all_pdf/manusmriti.pdf

 1. Jr, Donald R. Davis; Davis, Donald Richard (2010-01-21). The Spirit of Hindu Law (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-0-521-87704-6.
 2. http://bibleforchildren.org/PDFs/english/Noah%20and%20the%20Great%20Flood%20English.pdf
"https://te.wikipedia.org/w/index.php?title=మనుస్మృతి&oldid=3304038" నుండి వెలికితీశారు