మనోరమ డోబ్రియాల్ శర్మ
మనోరమ డోబ్రియాల్ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన డెహ్రాడూన్‌కు తొలి మహిళా మేయర్‌గా, ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు తొలి మహిళా సభ్యురాలుగా ఎన్నికైంది.
మనోరమ డోబ్రియాల్ శర్మ | |||
| |||
పదవీ కాలం 26 నవంబర్ 2014 – 18 ఫిబ్రవరి 2015 | |||
ముందు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
తరువాత | రాజ్ బబ్బర్ | ||
నియోజకవర్గం | ఉత్తరాఖండ్ | ||
డెహ్రాడూన్ మేయర్
| |||
పదవీ కాలం 8 ఫిబ్రవరి 2003 – 7 ఫిబ్రవరి 2008 | |||
ముందు | నూతనంగా ఏర్పాటైంది | ||
తరువాత | డిఎమ్ డెహ్రాడూన్ (అడ్మినిస్ట్రేటర్) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 9 మార్చి 1955 | ||
మరణం | 2015 ఫిబ్రవరి 18 | (వయసు 59)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
రాజకీయ జీవితం
మార్చుమనోరమ డోబ్రియాల్ శర్మ 1972లో కాంగ్రెస్‌లో చేరి 1981 నుండి 1985 వరకు జిల్లా యువజన అధ్యక్షురాలిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేసి 2001లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఆమె 2003లో డెహ్రాడూన్‌కు మొదటి మహిళా మేయర్‌గా ఎన్నికైంది.
మనోరమ డోబ్రియాల్ శర్మ 2008లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, 2009 నుండి 11 వరకు హిమాచల్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసింది. ఆమె 2014 నవంబర్ 13న ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.[1]
నిర్వహించిన పదవులు
మార్చుసంవత్సరం | వివరణ |
---|---|
2003 - 2008 | డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ |
2005 - 2008 | ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ చైర్‌పర్సన్, న్యూఢిల్లీ |
2006 - 2010 | చైర్‌పర్సన్, ఎన్నికైన బోర్డు సభ్యుడు, కామన్వెల్త్ స్థానిక ప్రభుత్వ ఫోరమ్ |
2007 - 2009 | సభ్యురాలు, బాల కార్మికులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డు, L&E మంత్రిత్వ శాఖ , (భారతదేశం) |
2009 - 2012 | సభ్యురాలు, సలహా బోర్డు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (భారతదేశం) |
2014 - 2015 | రాజ్యసభకు ఎన్నిక (పదవిలో మరణించారు) |
మరణం
మార్చుమనోరమ డోబ్రియాల్ శర్మ 59 సంవత్సరాల వయస్సులో 2015 జనవరి 31న లివర్ క్యాన్సర్ లక్షణాలు కనిపించడంతో గుర్గావ్‌లోని ఆర్టెమిస్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మరణించింది.[2][3][4] ఆమెకు ముగ్గురు కుమారులు వివేక్ శర్మ, మయాంక్ శర్మ, అలోక్ శర్మ ఉన్నారు
మూలాలు
మార్చు- ↑ The Indian Express (8 November 2014). "Uttarakhand: Congress declares Manorama Dobriyal as Rajya Sabha nominee" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
- ↑ The Times of India (18 February 2015). "Cong RS MP Manorama Sharma passes away at 59". Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
- ↑ The Hindu (18 February 2015). "Congress MP Manorama Sharma passes away" (in Indian English). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
- ↑ India Today (20 February 2015). "Rajya Sabha Congress Minister Manorama Dobriyal Sharma dies aged 59" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.