మన ఊరు - మన ప్రణాళిక (పథకం)

మన ఊరు మన ప్రణాళిక పథకం తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి ప్రతిపాదనలు సేకరించింది. ప్రజల సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మార్గదర్శకత్వంలో ఈ పథకం రూపొందించబడింది.[1]

మన ఊరు మన ప్రణాళిక పథకం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

ప్రారంభం మార్చు

ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఉద్దేశ్యం మార్చు

సమగ్ర గ్రామాభివృధ్ధికి కీలక అంశాలైన సహజ వనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనతో కీలకపాత్ర పోషించేందుకు పంచాయితీ రాజ్ సంస్థ లను సంసిధ్ధులను చేసి సామాజిక న్యాయం, ఆర్థికాభివృధ్ధితో సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్ళడం.

లక్ష్యాలు మార్చు

  1. గ్రామ పంచాయితీల, గ్రామసభల యొక్క శక్తిసామర్ధ్యాలను పెంపొందించడం.
  2. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.
  3. గ్రామ పంచాయితీలలో అవగాహన కల్పించడం, సామర్ధ్యాల పెంపు ద్వారా వీటిని బలోపేతం చేయడం.
  4. ప్రజల భాగస్వామ్యం పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించు దిశగా గ్రామసభలను బలోపేతం చేయడం.[2]

రెండోసారి మార్చు

2017 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు రెండో దశ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 545 గ్రామీణ మండలాల్లో, 8,684 గ్రామాల్లో నిర్వహించారు. గ్రామాల వారీగా సంక్షేమ ప్రణాళికలను తయారుచేయటంతోపాటు, ప్రజల సంక్షేమావసరాల గుర్తింపే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.[3]

మూలాలు మార్చు

  1. తెలంగాణ మ్యాగజైన్. "మన ఊరు – మన ప్రణాళిక". magazine.telangana.gov.in. Retrieved 29 March 2018.
  2. Mana Ooru Mana Pranalika. "Objectives". www.mvmp.cgg.gov.in. Archived from the original on 10 మార్చి 2018. Retrieved 29 March 2018.
  3. సాక్షి, హైదరాబాద్ సిటీ (8 February 2017). "మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక". Retrieved 29 March 2018.