మమతా బాలా ఠాకూర్
మమతా బాలా ఠాకూర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2015లో బంగావ్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1] ఆమె 2024 రాజ్యసభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.[2]
మమతా ఠాకూర్ | |||
పదవీ కాలం 2024 – 2030 | |||
పదవీ కాలం 16 ఫిబ్రవరి 2015 – 23 మే 2019 | |||
తరువాత | శాంతను ఠాకూర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బంగాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 15 మే 1967 చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ | ||
నివాసం | ఠాకూర్‌నగర్ | ||
వృత్తి | సామజిక సేవకురాలు, రాజకీయ నాయకురాలు |
రాజకీయ జీవితం
మార్చుమమతా బాలా ఠాకూర్ 2014 లోక్‌సభ ఎన్నికలలో టీఎంసీ మతువా నేత కపిల్ కృష్ణ ఠాకూర్ బంగాన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచాడు, ఆ తరువాత కేవలం ఐదు నెలల తర్వాత ఆయన ఆకస్మిక మరణించడంతో ఆ తరువాత 2015లో జరిగిన ఉప ఎన్నికలో కపిల్ భార్య మమతా బాలా ఠాకూర్‌కు టిక్కెట్ కేటాయించింది. ఆమె 43.27 శాతం ఓట్లతో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3] మమతా బాలా ఠాకూర్ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శంతను ఠాకూర్ చేతిలో 1,11,594 ఓట్ల తేడాతో ఓడిపోయి, 40.92 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
మమతా బాలా ఠాకూర్‌ను 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా 2024 ఫిబ్రవరి 11న ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని అమలు చేస్తామన్న భారతీయ జనతా పార్టీ వాగ్దానాలతో మతువా కమ్యూనిటీపై ప్రకటించడంతో అదే సామజిక వర్గంకు చెందిన మమతా బాలా ఠాకూర్‌ను తృణమూల్ కాంగ్రెస్ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[4]
మమతా బాలా ఠాకూర్ మతువా సామజికవర్గానికి చెందిన నాయకురాలు. పశ్చిమ బెంగాల్‌లో రాజబన్‌షీల తర్వాత మతువాలు రెండవ అతిపెద్ద షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) సంఘంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తున్న మతువా సామజికవర్గం వారు భారతీయ పౌరసత్వం మంజూరు చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ The Hindu (13 February 2024). "The Trinamool's Rajya Sabha nominations and the underlying message" (in Indian English). Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ The Hindu (11 February 2024). "Trinamool names Sagarika Ghose, Sushmita Dev, and two others for Rajya Sabha" (in Indian English). Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ "Bangaon Bye Elections to Lok Sabha 2015". elections.in. Retrieved 25 May 2015.
- ↑ Mana Telangana (11 February 2024). "బెంగాల్ నుంచి రాజ్యసభకు టిఎంసి అభ్యర్థుల ప్రకటన". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.