మయూరేశ్వర దేవాలయం (మోర్గావ్)

మహారాష్ట్ర, పూణె జిల్లా, మొరగావ్‌ గ్రామంలో ఉన్న వినాయకుడి దేవాలయం.

మయూరేశ్వర దేవాలయం (మోరేశ్వర దేవాలయం) మహారాష్ట్ర పూణె జిల్లా, పూణే నగరానికి సుమారు 65 కి.మీ.ల దూరంలో ఉన్న మొరగావ్‌ గ్రామంలోని వినాయకుడి దేవాలయం. మహారాష్ట్రలో అష్టవినాయక అని పిలువబడే ఎనిమిది వినాయక దేవాలయాలలో ఇదీ ఒకటి.

మయూరేశ్వర దేవాలయం (మోర్గావ్)
మయూరేశ్వర దేవాలయ శిఖరం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:పూణే జిల్లా
ప్రదేశం:మోర్గావ్
భౌగోళికాంశాలు:18°16′33.8″N 74°19′17″E / 18.276056°N 74.32139°E / 18.276056; 74.32139
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:దేవాలయ శైలీ

ప్రాముఖ్యత మార్చు

మోర్గావ్ దేవాలయం పూణే చుట్టూ ఉన్న ఎనిమిది వినాయక దేవాలయాల తీర్థయాత్రకు ప్రారంభ స్థానం.[1] దేవాలయ సర్క్యూట్‌ను అష్టవినాయక ("ఎనిమిది వినాయకులు") అని పిలుస్తారు. యాత్రికుడు తీర్థయాత్ర ముగింపులో మోర్గావ్ దేవాలయాన్ని సందర్శించకపోతే తీర్థయాత్ర అసంపూర్ణంగా జరిగినట్లు పరిగణించబడుతుంది. ఇది భారతదేశం అగ్రగామి వినాయక తీర్థయాత్ర" అని కూడా గుర్తించబడింది.[1][2]

వినాయక పురాణం ప్రకారం మోర్గావ్ (మయూరపురి) అనేది వినాయకుగికి మూడు ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి, భూమిపై ఉన్న ఏకైక ప్రదేశం అని పేర్కొనబడింది.[2] ప్రళయం సమయంలో, వినాయకుడు ఇక్కడ యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పేర్కొనబడింది.[3] ఈ దేవాలయ పవిత్రత హిందూ పవిత్ర నగరమైన కాశీతో పోల్చబడింది.[1]

మోర్యా గోసావి (మొరోబా) ప్రముఖ గణపత్య సాధువు. చించ్వాడ్‌కు మారడానికి ముందు మోర్గావ్ వినాయక దేవాలయంలో పూజలు చేసి, కొత్త దేవాలయాన్ని నిర్మించాడు.[4] మోర్గావ్ దేవాలయం, పూణే సమీపంలోని ఇతర గణపత్య కేంద్రాలు, 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలోని పీష్వా పాలకుల నుండి రాచరిక పోషణను పొందాయి. వినాయకుడిని తమ కులదైవత్ ("కుటుంబ దైవం")గా ఆరాధించే పేష్వాలు, భూమి/లేదా నగదు రూపంలో విరాళంగా ఇచ్చారు. ఈ వినాయక దేవాలయాలకు అదనంగా వాటిని అందించారు.[1]

పండుగలు మార్చు

వినాయక జయంతి (మాఘ శుక్ల చతుర్థి), వినాయక చవితి (భాద్రపద శుక్ల చతుర్థి) పండుగలు 4వ చంద్రుని రోజున వరుసగా మాఘ, భాద్రపద హిందూ మాసాలలో ప్రకాశవంతమైన పక్షం రోజులలో, భక్తులు పెద్ద సంఖ్యలో మయూరేశ్వర దేవాలయానికి తరలి వస్తారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Anne Feldhaus (19 December 2003). "Connected places: region, pilgrimage, and geographical imagination in India". Palgrave Macmillan. pp. 142–3, 145–6, 160. ISBN 978-1-4039-6324-6. Retrieved 13 January 2010.
  2. 2.0 2.1 Grimes pp. 37–8
  3. Grimes pp.112–3
  4. "Poona District: Places – Morgaon". The Gazetteers Department, Government of Maharashtra. 2006. Archived from the original on October 16, 2009. Retrieved 5 January 2010.

బయటి లింకులు మార్చు

  • దేవాలయ సమయాలు మయూరేశ్వర్ గణపతి ఆలయం మోర్గావ్ - ఆలయ సమయాలు, భక్త నివాస్