మరికల్ మండలం

తెలంగాణ నారాయణపేట జిల్లా లోని మండలం


మరికల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు, చెందిన మండలం.[1]

మరికల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మరికల్ స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మరికల్ స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మరికల్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట జిల్లా
మండల కేంద్రం నారాయణపేట
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 158 km² (61 sq mi)
జనాభా
 - మొత్తం 37,650
 - పురుషులు 18,335
 - స్త్రీలు 19,315.
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 31 కి. మీ. దూరంలో జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుండి కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు రోడ్డు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 14 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

గతంలో మరికల్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట్ రెవెన్యూ డివిజను పరిధిలోని ధన్వాడ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మరికల్ గ్రామాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

నారాయణపేట జిల్లాకు మార్పు మార్చు

గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[4]

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 158 చ.కి.మీ. కాగా, జనాభా 37,650. జనాభాలో పురుషులు 18,335 కాగా, స్త్రీల సంఖ్య 19,315. మండలంలో 7,506 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పూసలపాడ్
  2. మాధ్వార్
  3. ఎలిగండ్ల
  4. పస్పుల
  5. మరికల్
  6. ఇబ్రహీంపట్నం
  7. పెద్దచింతకుంట
  8. తీలేరు
  9. వెంకటాపూర్
  10. రాకొండ
  11. చిత్తనూర్
  12. ఎక్లాస్‌పూర్
  13. జిన్నారం
  14. కన్మనూర్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  3. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  4. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 12 April 2019. Retrieved 4 March 2019.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు