మరిపెడ మండలం
మరిపెడ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం మరిపెడ.
మరిపెడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, మరిపెడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′11″N 79°51′24″E / 17.403063°N 79.856644°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | మరిపెడ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 235 km² (90.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 83,876 |
- పురుషులు | 43,102 |
- స్త్రీలు | 40,774 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.06% |
- పురుషులు | 54.98% |
- స్త్రీలు | 32.68% |
పిన్‌కోడ్ | 506315 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 83,876 - పురుషులు 43,102 - స్త్రీలు 40,774.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 235 చ.కి.మీ. కాగా, జనాభా 70,036. జనాభాలో పురుషులు 36,129 కాగా, స్త్రీల సంఖ్య 33,907. మండలంలో 17,273 గృహాలున్నాయి.[3]
వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు
మార్చులోగడ మరిపెడ, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని గ్రామం/మండలం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మరిపెడ మండలాన్ని (1+18) పందొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలం లోని
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.