మర్పల్లి మండలం

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం


మర్పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మర్పల్లి, ఈ మండలానికి కేంద్రం.

మర్పల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°32′26″N 77°46′19″E / 17.540606°N 77.771988°E / 17.540606; 77.771988
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం మర్పల్లి కలాన్
గ్రామాలు 28
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,090
 - పురుషులు 25,714
 - స్త్రీలు 25,376
అక్షరాస్యత (2001)
 - మొత్తం 45.86%
 - పురుషులు 57.58%
 - స్త్రీలు 33.51%
పిన్‌కోడ్ 501202

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 51,090. జనాభాలో పురుషులు 25,714 కాగా, స్త్రీల సంఖ్య 25,376. మండలంలో 10,961 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

మార్చు

ఈ మండలానికి సమీపంలో సదాశివపేట, మునిపల్లి మండలం ఉత్తరాన, మోమిన్‌పేట మండలం తూర్పువైపున, కోహీర్ మండలం పడమరన, కోట్‌పల్లి, బంట్వారం మండలాలు దక్షిణాన ఉన్నాయి.

రవాణా సదుపాయాలు

మార్చు

ఈ గ్రామానికి దగ్గరలోని పట్టణం సదాశివపేట 28 కి.మీ. దూరములో ఉంది. రోడ్డు వసతి వుండి బస్సు సౌకర్యముంది. ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషను మర్‌పల్లి రైల్వే స్టేషను. హైదరాబాద్ రైల్వే స్టేషను ఇక్కడికి 91 కి.మీ. దూరములో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు