మర్రి చెట్టు (2004 సినిమా)

మర్రి చెట్టు అనేది రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా 2004లో వచ్చిన హిందీ హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం వాస్తు శాస్త్రకు తెలుగు అనువాద చిత్రం.[1][2] ఈ సినిమాకి దర్శకత్వం సౌరబ్ నారంగ్ నిర్వహించాడు. ఇందులో జె డి చక్రవర్తి, సుష్మితా సేన్, ప్రియా రాయ్ చౌదరి, షియాజి షిండే తదితరులు నటించారు. కాగా సంగీతదర్శకుడు అమర్ మోహిల్ స్వరాలు సమకుర్చరు. ఇది 2004 అక్టోబరు 22న విడుదలైంది.

మర్రి చెట్టు
దర్శకత్వంసౌరబ్ నారంగ్
రచనచారు డూ ఆచార్య
నిర్మాతరామ్ గోపాల్ వర్మ
తారాగణంసుస్మితా సేన్
పీయా రాయ్ చౌదరి
జె. డి. చక్రవర్తి
ఛాయాగ్రహణంసచిన్ కె. కృష్ణ
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంఅమర్ మొహిలే
దేశంఇండియా
భాషహిందీ చిత్రం వాస్తుశాస్త్ర కు తెలుగు డబ్బింగ్ చిత్రం

తారాగణం

మార్చు

విరాగ్ (జె.డి.చక్రవర్తి), జిల్మిల్ (సుస్మితా సేన్) జంటలో ఆమె పూణేలోని ఓ ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్‌గా పనిచేస్తుంది. కాగా విరాగ్ వృత్తి రీత్యా రచయిత. అతని వృత్తిరీత్యా కొత్త అసైన్‌మెంట్‌ని పూర్తి చేయడానికి, ప్రశాంతకొరకు పూణే శివార్లలోని శాంతి కుటీర్‌కి మారింది. వారి కుటుంబం. వారి కొడుకు రోహన్ (అహ్సాస్ చన్నా) వేసవి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. జిల్మిల్ చెల్లెలు రాధిక (పీయా రాయ్ చౌదరి) కూడా వారితో కలిసి నివసిస్తుంది.

ఇక సారాంశం ఏంటంటే, అక్కడ కుమారుడు వివరించలేని భయానక సంఘటనలను గమనిస్తాడు, కాని హత్యలు ప్రారంభమయ్యే వరకు కుటుంబ సభ్యులు అతనిని విస్మరిస్తారు.

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సౌరబ్ నారంగ్
  • నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
  • కథ: చారు డూ ఆచార్య
  • సంగీతం: అమర్ మొహిలే
  • ఛాయాగ్రహణం: సచిన్ కె. కృష్ణ
  • కూర్పు: ఆరిఫ్ షేక్

మూలాలు

మార్చు
  1. "JD Chakravarthy calls RGV a master of horror films". 3 October 2012. Archived from the original on 15 జూలై 2014. Retrieved 20 జూలై 2023.
  2. "Vaastu Shastra". 22 October 2004.