మలేషియా తెలుగువారు

మలేషియా తెలుగు
(మలేషియా తెలుగు నుండి దారిమార్పు చెందింది)

మలేసియాలో ప్రస్తుతం ఉన్న తెలుగు వారు నాలుగవ లేక ఐదవ తరం వారు. వీరి పూర్వికులంతా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ప్రాంతం నుండి బ్రిటిష్ వారి కాలనీలు ఏర్పాటు చేసే క్రమంలో మలేషియాకి వలస వచ్చి స్థిరపడినవారు.వీరిలో చాలామంది వలస కూలీలుగా, వ్యాపారులుగా మలేషియాకి శరణార్థులుగా వచ్చి స్థిరపడ్డారు, ఆవిదంగానే ఇంకొక సమూహం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాని జపాన్ర్ ముట్టడించినప్పుడు బర్మా నుండి శరణార్థులుగా వచ్చారు.

Malaysians of Telugu origin
Telugu Malaysia
మలేషియా తెలుగువారు
Total population
300,000
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
పెనిన్సులర్ మలేషియా
భాషలు
తెలుగు, ఇంగ్లీషు,మలయు2
మతం
హిందూ మతము, ఇతర మతాలు
సంబంధిత జాతి సమూహాలు
మలేషియన్ ఇండియన్

తరువాతి కాలంలో భారతదేశం నుండి మలేషియాలో ఉద్యోగరీత్యా వస్తున్న తెలుగువారి వలన, మలేషియా తెలుగు వారిలో తెలుగు భాషఫై ఒక కొత్త ఒరవడిని, ఆసక్తిని తీసుకు వచ్చి ఇక్కడి తెలుగు భాషను పునర్వ్యవస్తీకరించాలని నిశ్చయించుకున్నారు. మలేషియాలోని తెలుగువారి వాణిని, అభిప్రాయాలని తెలియచేయడానికి లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థగా "మలేషియా తెలుగు సంఘము" ఏర్పాటు చేయడం జరిగింది. 17 జూలైలో 1955 మొదటిసారి పెరాక్ జిల్లాలో ఒక తెలుగు సంస్థగా స్థాపించబడినది, తరువాత 1956 ఫిబ్రవరి 17 లో అధికారికంగా "మలయ ఆంధ్ర సంఘము" అన్న పేరుతో నమోదు చేయబడింది. ఆ తరువాతి కాలంలో డిసెంబరులో మలేషియా ఆంధ్ర సంఘముగా పేరు మార్చడం జరిగింది. ఆ క్రమంలోనే "తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా"గా పేరు మార్చడం జరిగింది. దీనినే "మలేషియా తెలుగు సంఘము" అని కూడా పిలుస్తారు, అలాగే భాషా మలేషియాలో పెర్సాత్వాన్ తెలుగు మలేషియాగా అధికారికంగా వ్యవహరిస్తారు.

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు మార్చు

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలో తీర్మానం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను మలేషియా దేశంలో నిర్వహించింది. ఇవి 1981 ఏప్రిల్ 14వ నుంచి 18 వ తేదీ వరకు మలేషియా దేశ రాజధాని అయిన కౌలాలంపూర్‌లో జరిగాయి . ఈ సభలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా అక్కడ మలేషియా ఆంధ్ర సంఘం సంయుక్త నిర్వహింపబడినవి.ఈ సభలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, ఇతర మంత్రులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. మొదటిరోజు ప్రాంభోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షత వహించగా, మలేషియా ప్రధాని డా|| మహాతిర్ బినా మహమ్మద్ ముఖ్యఅతిధిగా విచ్చేసారు.ఐదు రోజులు జరిగిన ఈ సభలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే గాక దేశంలోని ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న అగ్రశ్రేణి కళాకారులు, భాషా పండితులు, పరిశోధక విమర్శకులు, కవులు, కళాకారులు ఎందరో పాల్గొని వీటి విజయానికి తోడ్పడ్డారు. వీరితోపాటు మలేషియాలోని ఉన్న తెలుగు ప్రముఖులు కూడా తమ వంతు పాత్రను నిర్వహించారు.

జనాభా మార్చు

మలేషియా తెలుగు జనాభా అంత కచ్చితంగా చెప్పడానికి కుదరలేకుండా ఉంది, ఎందుకంటే జనాభా గణన (census) సమయంలో చాలా మంది తమను ఇండియన్లుగా నమోదు చేయడం వలన సెన్సస్ వారు తమిళులుగా లెక్కించడం జరిగింది. ఈ చర్య తెలుగు జనాభాను చాలా తక్కువగా చేసి చూపుతుంది.

భాష  మార్చు

మలేషియాలోని స్థానిక తెలుగువారు తెలుగు భాషనే ఎక్కువగా మాట్లాడుతారు. 1980 వరకు ప్రాథమిక తెలుగు మాధ్యమిక పాఠశాలలు ఉండేవి. చివరిగా 1990 లో ఈ పాఠశాలలు అన్ని ఆదరణ సరిగ్గా లేనందున మూతబడ్డాయి.

మూలాలు, వనరులు మార్చు

బయటి లింకులు మార్చు