మల్లాది విష్ణువర్ధన్ (మల్లాది విష్ణు గా సుపరిచితుడు) వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు[1]. అతను 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున విజయవాడ మధ్య శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు.[2] [3]

మల్లాది విష్ణు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
నియోజకవర్గము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
సంతానము 2 కుమార్తెలు
వెబ్‌సైటు http://www.malladivishnu.in

జీవిత విశేషాలుసవరించు

మల్లాది విష్ణు కృష్ణా జిల్లా లోని విజయవాడలో ఎం. వెంకట సుబ్బారావుకు 1964 లో జన్మించాడు. 1982 లో అతను VBM కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేషన్ లో బి.కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితంసవరించు

విష్ణు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించాడు. అతను 2009-2014 వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను తన ప్రత్యర్థి అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ పై 800వోట్ల తేడాతో 2009 సాధారణ ఎన్నికలలో గెలుపొందాడు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం పట్టణ అభివృద్ధి అథారిటీ (వుడా) ఛైర్మన్‌గా పనిచేశాడు.

విష్ణువు వైయస్ఆర్సిపిలో చేరాడు మరియు అతను నాయకుడు. 2019 లో విష్ణు ఎమ్మెల్యే పదవిని గెలుచుకున్నారు మరియు ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైయస్ఆర్సిపి ప్రస్తుత ఎమ్మెల్యే (ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు).

విష్ణు 2019లో యై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే గా 20 ఓట్ల తో గెలిచాడు[4]

మూలాలుసవరించు

  1. http://www.hindu.com/2009/05/17/stories/2009051753040200.htm
  2. http://www.thehindu.com/news/cities/Vijayawada/congress-leaders-kick-off-unofficial-poll-campaign/article4097809.ece
  3. http://www.thehindu.com/news/cities/Vijayawada/political-parties-go-all-out-to-woo-devotees/article4012671.ece
  4. "Malladi Vishnu Vardhan Alias Malladi Vishnu | MLA | YSRCP | Vijayawada Central". theLeadersPage | the Leaders Page (in ఆంగ్లం). 2020-05-20. Retrieved 2020-06-09.

బయటి లింకులుసవరించు