మల్లాపూర్ మండలం (జగిత్యాల జిల్లా)

తెలంగాణ, జగిత్యాల జిల్లా లోని మండలం


మల్లాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

మల్లాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, మల్లాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, మల్లాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, మల్లాపూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం మల్లాపూర్ (జగిత్యాల జిల్లా)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 215 km² (83 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 53,870
 - పురుషులు 26,080
 - స్త్రీలు 27,790
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.40%
 - పురుషులు 53.03%
 - స్త్రీలు 26.86%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన మెట్‌పల్లి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెట్‌పల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జగిత్యాల డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం మల్లాపూర్.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 53,870 - పురుషుల సంఖ్య 26,080 - స్త్రీల సంఖ్య 27,790.[3] అక్షరాస్యత మొత్తం 39.40% - పురుషుల అక్షరాస్యత 53.03% - స్త్రీల అక్షరాస్యత 26.86%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 215 చ.కి.మీ. కాగా, జనాభా 52,087. జనాభాలో పురుషులు 25,220 కాగా, స్త్రీల సంఖ్య 26,867. మండలంలో 13,753 గృహాలున్నాయి.[4]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు

మార్చు

లోగడ మల్లాపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మల్లాపూర్ మండలాన్ని (1+20) ఇరవైఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. మల్లాపూర్
  2. ఓబులాపూర్
  3. సంగెం
  4. శ్రీరాంపూర్
  5. దామరాజపల్లి
  6. వల్గొండ
  7. వేంపల్లి వెంకటరావుపేట
  8. గొర్రెపల్లి
  9. మొగల్‌పేట్
  10. నడుకుడ
  11. సిర్పూర్
  12. ఇందిరానగర్
  13. రేగుంట
  14. గుండంపల్లి
  15. రాఘవపేట
  16. ముత్యంపేట్
  17. చిట్లాపూర్
  18. సాతారం

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

మార్చు