మల్లెత్తుల పద్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

మల్లెత్తుల పద్మ
Malletthula Padma.jpg
నివాసంగొల్లపల్లి, కరీంనగర్ జిల్లా
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తిసామాజిక కార్యకర్త, గొల్లపల్లి గ్రామ సర్పంచ్

జీవిత విశేషాలుసవరించు

కరీంనగర్ జిల్లా, గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లెత్తుల పద్మ 2013లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయింది.

గ్రామ సేవలుసవరించు

తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధికి కృషిచేసింది. ఈ గ్రామంలోని ప్రజలందరికీ ఎకౌంట్లు తెరవడం, డెబిట్‌ కార్డులు, స్వైపింగ్‌ మెషీన్ల పంపిణీ మొదలైన కార్యక్రమాలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీలను నిర్వహించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టిని ఆకర్షించి గొల్లపల్లికి నగదు రహిత గ్రామంగా గుర్తింపును తీసుకొచ్చింది.[1]

బహుమతులు - పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 11 April 2017.