మల్లోజుల వేణుగోపాల్
మల్లోజుల వేణుగోపాల్ (సాధన) కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. అతను భారతదేశంలో నిషేధించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్రకమిటీలో సభ్యుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు.
కుటుంబం
మార్చుమధురమ్మ(మరణం 2022 అక్టోబరు 1), మల్లోజుల వెంకటయ్య (మరణం 1997) దంపతుల ముగ్గురు కుమారులలో మల్లోజుల వేణుగోపాల్ చిన్నవాడు.[1] అతను సుధీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్ జీ (మల్లోజుల కోటేశ్వరరావు) కు తమ్ముడు.[2][3] 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు. మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా కు చెందిన పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. వీరి అన్నయ్య అంజన్న పౌరోహిత్యం చేసుకుంటున్నాడు. వీరి తాత, తండ్రి.. ఇద్దరూ భారత స్వాతంత్ర్యసమరయోధులు. [4][5] అతను వామపక్ష తీవ్రవాదంలో చేరిన తరువాత 30 సంవత్సరాలపాటు ఇంటిని వదిలి దూరంగా ఉన్నాడు. 2018 డిసెంబరు 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నర్మద అక్కతో పాటు మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా అక్క కూడా మరణించింది.[6]
కార్యకలాపాలు
మార్చుఅతను పూర్వపు పీపుల్స్ వార్ గ్రూపులో నాయకునిగా భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పనిచేసాడు. అతను మహారాష్ట్ర రాష్ట్రంలోని గార్చిరౌలీ ప్రాంతంలో గల మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేసాడు. [7] అతను దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళ లోని గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్ ను నెలకొల్పడానికి నియమింపబడ్డాడు.[8] 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత అతను సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమింపబడ్డాడు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణా భాద్యతలను స్వీకరించాడు. [9] ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటన లో 76మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు కు చెందిన పోలీసుల మరణానికి వెనుక ఇతని హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. [10] ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అతని తలపై భారీ మొత్తాలను ప్రకటించారు. కిషన్‌జీ మరణం తరువాత అతనిని పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరితుతున్న లాల్‌గర్ ఉద్యమానికి నాయకునిగా నియమించారు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ, వేణుగోపాల్‌రావు తల్లి మల్లోజుల మధురమ్మ ఇక లేరు | Mallojula Madhuramma, mother of top Maoist leaders Kishanji and Venugopal Rao is no more". web.archive.org. 2022-11-02. Archived from the original on 2022-11-02. Retrieved 2022-11-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 "Kishenji's brother Venugopal is new Maoist chief of Lalgarh". Retrieved March 1, 2018.
- ↑ 3.0 3.1 Tamal Sengupta. "kishenji's brother Venugopal to concentrate in Jangalmahal". Retrieved March 1, 2018.
- ↑ Amit Chaudhuri. "Calcutta: Two Years in the City". Retrieved March 1, 2018.
- ↑ "Kishenji Maoist Leader Profile". Retrieved March 1, 2018.
- ↑ Maitra, Pradeep Kumar. "Top woman Naxal leader dead?". Hindustan Times. Retrieved 23 August 2019.
- ↑ V R Raghavan. "The Naxal Threat: Causes, State Response and Consequences". Retrieved March 1, 2018.
- ↑ "No dearth of leaders in CPI (Maoist)". timesofindia.indiatimes.com. Retrieved March 1, 2018.
- ↑ "Top Maoist leader Ganapathi admits to leadership crisis in party". tehelka.com. September 19, 2013. Archived from the original on 2018-05-19. Retrieved March 1, 2018.
- ↑ "The men who run Dandakaranya". financialexpress.com. Retrieved March 1, 2018.