ఇడుక్కి జిల్లా
ఇడుక్కి జిల్లా, భారతదేశం, కేరళ రాష్ట్రంలోని ఒక జిల్లా.[1][2] ఈ జిల్లా 1972 జనవరి 26 న ఏర్పడింది. జిల్లా రూపొందించిన ఆరంభంలో జిల్లా కేంద్రంగా కొట్టాయం ఉంటూ ఉండేది. 1976 తరువాత జిల్లాకేంద్రం పైనావు పట్టణానికి మార్చారు. ఇడుక్కి జిల్లా కేరళలోని పశ్చిమ కనుమలలోని ఏలకుల కొండల మధ్య ఉంది. ఇడుక్కి జిల్లాలో కట్టప్పనా, తోడుపుజా అనే రెండు పురపాలక సంఘ పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఐదు తాలూకాలు ఉన్నాయి. కొట్టాయం జిల్లా నుండి పూర్వ మాజీ హై రేంజ్ డివిజన్‌లోని పీరుమాడే, ఉడుంబంచోల, దేవికులం తాలూకాలను, ఎర్నాకులం జిల్లా నుండి తొడుపుజ తాలూకాను తీసుకొని ఈ జిల్లా 1972 జనవరి 26 న ఏర్పాటు చేయబడింది.[3] జిల్లాలో మలయాళం, ఆంగ్లం రెండు అధికారిక పరిపాలనా భాషలుగా ఉన్నాయి.[4] ఇడుక్కి జిల్లాలో మలయాళం తర్వాత అత్యధికంగా తమిళ భాష మాట్లాడతారు.[5]
Idukki
ഇടുക്കി | |
---|---|
district | |
Country | భారత దేశం |
State | కేరళ |
ప్రధాన కార్యాలయం | Painavu |
Government | |
• Collector | E. Devadasan |
విస్తీర్ణం | |
• Total | 4,479 కి.మీ2 (1,729 చ. మై) |
Elevation | 1,200 మీ (3,900 అ.) |
జనాభా (2011) | |
• Total | 11,29,221 |
• జనసాంద్రత | 259/కి.మీ2 (670/చ. మై.) |
భాషలు | |
• అధికార | tamil, Malayalam, English |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-KL-IDU |
Vehicle registration | KL-06(Idukki),KL-37(Vandipperiyar),KL-38(Thodupuzha),KL-68(Adimaly),KL-69(Udumbanchola) (KLI{Old}). |
పేరువెనుక చరిత్ర
మార్చుఇడుక్కి అంటే మలయాళంలో ఇరుకైన లోయ అని అర్ధం.
భౌగోళికం
మార్చుఇడుక్కి జిల్లా వైశాల్యం 4,479 చ.కి.మి. ఇది కేరళ రాష్ట్రంలోని జిల్లాలలో వైశాల్యంలో 2 వ స్థానంలో (మొదటి స్థానంలో పాలక్కాడు జిల్లా ) ఉంది. కఠినమైన పర్వతాలు, అరణ్యాలు జిల్లాలో 97% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. జిల్లా సరిహద్దులో జిల్లా ఉంది, జిల్లా దక్షిణసరిహద్దులో పతనంతిట్ట జిల్లా, జిల్లా ఆగ్నేయసరిహద్దులో కొట్టాయంజిల్లా ఉంది, జిల్లా వాయవ్య సరిహద్దులో ఎర్నాకుళం జిల్లా ఉంది, జిల్లా ఉత్తర సరిహద్దులో త్రిసూర్ జిల్లా ఉంది, జిల్లా తూర్పు సరిహద్దులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కోయంబత్తూర్ జిల్లా, దిండిగల్ జిల్లా, థేని జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాను రహదారి మార్గం ద్వారా మాత్రమే చేరుకోవడానికి అవకాశం ఉంది. జిల్లాను చేరడానికి రైలు, వాయు మార్గాలు లేవు. జాతీయరహదారి 49, రాష్టీయ రహదారి 13-33 మార్గాలు జిల్లా గుండా పోతున్నాయి.[6] దక్షిణభారతీయ హిమాలయాలుగా ప్రసిద్ధిగాంచిన ఆనముడి శిఖరం ఈ జిల్లాలోనే ఉంది. ఇది దేవికుళం తాలూకా లోని అడిమలై బ్లాక్ కుట్టంపుళా పంచాయితీలో కన్నన్ దేవన్ కొండలలో ఉంది. జిల్లాలో సముద్రమట్టానికి 2,000 మీ. ఎత్తు ఉన్న 13 శిఖరాలు ఉన్నాయి. జిల్లాలో పెరియార్, తొడుపుళయార్, తలయార్ నదులు ప్రవహిస్తున్నాయి.ఇడిక్కి తాలూకాలో నిర్మించబడిన ఆర్చ్ డాం ఆసియాలో పెద్దదిగా గుర్తినబడుతుంది. పెరియార్ నది ప్రవాహ మార్గంలో కురువన్, కురతి అనే బ్రహ్మాండమైన బండల నేపథ్యంలో ఈ ఆర్చ్ ఆనకట్ట నిర్మించబడింది..[6]
జనాభా గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 47,666 | — |
1911 | 99,564 | +7.64% |
1921 | 1,08,751 | +0.89% |
1931 | 1,87,680 | +5.61% |
1941 | 2,44,296 | +2.67% |
1951 | 3,31,422 | +3.10% |
1961 | 5,74,844 | +5.66% |
1971 | 7,58,166 | +2.81% |
1981 | 9,55,241 | +2.34% |
1991 | 10,55,023 | +1.00% |
2001 | 11,29,221 | +0.68% |
2011 | 11,08,974 | −0.18% |
2018 | 10,93,156 | −0.21% |
source:[7] |
2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలోని ఇడుక్కి జిల్లాలో మొత్తం జనాభా 1,10,8,974. వీరిలో 5,52,808 మంది పురుషులు కాగా, 556,166 మంది స్త్రీలు ఉన్నారు. 2011లో జిల్లాలో మొత్తం 2,79,812 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,006. మొత్తం జనాభాలో 4.7% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 95.3% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 95.6% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 91.8%గా ఉంది.అలాగే ఇడుక్కి జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,036 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1,005గా ఉంది. జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 10,5,641, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 53,785 మంది మగ పిల్లలు కాగా, 51856 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇడుక్కిలోని పిల్లల లింగ నిష్పత్తి 964, జిల్లా సగటు లింగ నిష్పత్తి (1,006) కంటే తక్కువ. జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 91.99%. ఇడుక్కి జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 85.36%, స్త్రీల అక్షరాస్యత రేటు 81.11% ఉంది.[9]
మాట్లాడే భాషలు
మార్చుజిల్లాలో మలయాళం, ఆంగ్లం రెండు అధికారిక పరిపాలనా భాషలు.[10] ఇడుక్కి జిల్లాలో దాదాపు నాలుగు వంతుల మంది ప్రజలు తమ మాతృభాషగా మలయాళం మాట్లాడతారు. దేవికులం, పీరుమేడు, ఉడుంబంచోల తాలూకాల్లో గణనీయమైన తమిళ మైనారిటీ జనాభా ఉంది.[8] అయితే ఈ తాలూకాల్లో కూడా మలయాళీలు అధిక సంఖ్యలో ఉన్నారు.[8] జిల్లాలోని ఆదిమ తెగలు మలయాళం, తమిళంతో దగ్గరి సంబంధం ఉన్న మలవేదన్, మలారియన్, ముతువన్, పాలియన్ వంటి వారి స్వంత మాండలికాలను మాట్లాడతారు.[8]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మొత్తం జనాభాలో హిందువులు 48.86% (541,854) మంది ఉన్నారు, క్రైస్తవులు 43.42% (లాటిన్ రైట్, సైరో-మలబార్, జాకోబైట్, పెంటెకోస్టల్, మలంకర ఆర్థోడాక్స్) (4,81,507), ముస్లింలు 7.41% (82,206) మంది ఉన్నారు.[11]
పర్యాటక ఆకర్షణలు
మార్చుమున్నారు
మార్చుదక్షిణ భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ వేసవి విడిది మూణారు. ఇక్కడ మూడు సెలఏళ్ళు (ముతిరపుళా, నల్లతన్ని, కుండల ) సంగమిస్తున్నాయి కనుక ఇది మూణార్ (మూడు నదులు) అయింది. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద టీతోటలు ఉన్నాయి. ఇది సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యం పర్యాటకులను అధికంగా ఆకర్షించడం వలన ఇది ప్రముఖ పర్యాటక ఆకర్షణగా గుర్తింపు పొందింది.
మరయూరు
మార్చుపడమటి కనుమలలోని తూర్పు లోయలలోని సూదూరప్రాంత గ్రామం మరయూర్. కొత్తరాతి యుగపు చిహ్నాలు ఇక్కడ చెదరకుండా ఉన్నాయి. మునియారాస్ అనబడే ఇవి పురాతన గుహలు. కేరళ రాష్ట్రంలో చందన వృక్షాలున్న ఒకేఒక ప్రదేశమిదే.
తట్టకాడు పక్షుల సంరక్షణాలయం
మార్చు25 చ.కి.మీ వైశాల్యం ఉన్న " తట్టకాడు పక్షుల సంరక్షణాలయం" పెరియార్ నది ఉత్తర తీరంలో ఉంది. కేరళాలో ఇది మొదటి పక్షుల సంరక్షణాలయం. ఇందులో వైవిధ్యమైన పక్షులు ఉన్నాయి. కొచ్చిన్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న ఈ శరణాలయం ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ " సలీం అలిల్ " ప్రేరణతో ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఫాల్కన్, జంగిల్ ఫౌల్, వాటర్ హెన్, హార్న్‌బిల్ మొదలైన పక్షులు ఉన్నాయి. ఇక్కడ టేక్, రోజ్ వుడ్, మగాగని తోటలు అధికంగా ఉన్నాయి.
ఎర్నాకుళం వన్యమృగ అభయారణ్యం
మార్చుజిల్లాలోని ప్రకటినబడిన అభయారణ్యాలలో " ఎర్నాకుళం నేషనల్ పార్క్ " ఒకటి. ఇక్కడ " నీలగిరి తహ్ర్" ప్రపంచంలో అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ పార్క్ దక్షిణ భూభాగంలో ఆనముడి శిఖరం ఉంది. శిఖరం భూభాగంలో అధికంగా పసిరకభూమి ఉంది. సముద్రమట్టనికి 2,000 మీ ఎత్తులో వేగమైన ఈదురు గాలూల మద్య అత్యధికమైన వర్షపాతం ఉన్నందున ఇది మానవసంచారానికి అసాధ్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రఖ్యాత నీల కురుంజి పూలు పుష్పిస్తాయి. కురింజి పుష్పాలు 12 సంవత్సరాలకు ఒక సారి పుష్పిస్తాయి.[12]
తోడుపుజా శ్రీ కృష్ణ స్వామి ఆలయం
మార్చుశ్రీ కృష్ణ స్వామి ఆలయం ఇడుక్కి జిల్లాలోని తోడుపుజా పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది మువట్టుపుజా నదికి ఉపనది అయిన తోడుపుజయార్ ఒడ్డున ఉంది. శ్రీకృష్ణుడు తన కుడి పామ్‌లో వెన్నను పట్టుకున్న నవనీత కృష్ణుడి రూపంలో అక్కడ ఉన్నాడు.[13] ఈ ఆలయ తాంత్రిక హక్కులు అరమల్లూర్ కవనట్టు మనచే నిర్వహించబడతాయి. పూజలు 'పదింజరే మఠం', 'తురుతేల్ మఠం' అనే రెండు మఠాలచే నిర్వహించబడతాయి.[14]
సంరక్షిత ప్రదేశాలు
మార్చుఇడుక్కి జిల్లాలో పలు సంరక్షణాలయాలు ఉన్నాయి: దక్షిణ భూభాగంలో " పెరియార్ టైగర్ రిజర్వ్ " తూర్పు భూభాగంలో " కురింజిమల సరక్షణాలయం", వాయవ్య భూభాగంలో " చిన్నార్ వన్యమృగ సరక్షణాలయం", ఉత్తర భూభాగంలో " ఎర్నాకుళం నేషనల్ పార్క్ ", "అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం", ఆగ్నేయ భూభాగంలో " పంపాడం షోలా నేషనల్ పార్క్ ", పశ్చిమ భూభాగంలో "తట్టకాడ్ పక్షుల శరణాలయం " ఉన్నాయి. ఈ సంరక్షణాలయాలలో అనతరించే దశలో ఉన్న బెంగాల్ టైగర్, నీలగిరి తహ్ర్, గ్రిజ్లెడ్ జైంట్ స్క్వైర్ల్, నీలగిరి వుడ్ పీజియన్, గౌర్, సాంబార్ డీర్, పర్పుల్ ఫ్రాగ్, నీలకురుంజి వంటి ప్రాణులు ఉన్నాయి.[15][16]
మూలాలు
మార్చు- ↑ "Idukki | India". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-10-24.
- ↑ "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
- ↑ "History of Idukki District". District Idukki, Government of India.
- ↑ "The Kerala Official Language (Legislation) Act, 1969" (PDF). Archived from the original (PDF) on 2016-04-20. Retrieved 2023-06-01.
- ↑ "Table C-16 Population by Mother Tongue: Kerala". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ 6.0 6.1 "Idukki District". Archived from the original on 2015-02-17. Retrieved 2014-06-30.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 8.0 8.1 8.2 8.3 "Table C-16 Population by Mother Tongue: Kerala". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ "Idukki District Population Religion - Kerala, Idukki Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2023-06-01.
- ↑ "The Kerala Official Language (Legislation) Act, 1969" (PDF). Archived from the original (PDF) on 2016-04-20. Retrieved 2023-06-01.
- ↑ %20MDDS.XLS "మతం – కేరళ, జిల్లాలు , ఉప జిల్లాలు". సెన్సస్ ఆఫ్ ఇండియా 2011. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్.
{{cite web}}
: Check|url=
value (help) - ↑ "Information and Public Relations Department, Govt. of Kerala". Archived from the original on 2014-02-28. Retrieved 2014-06-30.
- ↑ "Temples of Idukki". keralawindow.net. Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-06.
- ↑ "✍pedia - Thodupuzha Sreekrishna Swamy Temple, Thodupuzha". ✍pedia. 2011-12-01. Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-06.
- ↑ Government of Kerala, Forest and Wildlife Department, Notification No. 36/2006 F&WLD (6 October 2006) retrieved 5/12/2007 Kerala Gazette Archived 2007-12-30 at the Wayback Machine
- ↑ Roy, Mathew (25 September 2006). "Proposal for Kurinjimala sanctuary awaits Cabinet nod". The Hindu. Retrieved 5 December 2007.
వెలుపలి లింకులు
మార్చు- Official Idukki District website
- Human Development Index (HDI) and Gender Development Index (GDI)
- ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో ఇడుక్కి జిల్లా