మళ్ళీ పెళ్ళి (1970 సినిమా)

మళ్ళీ పెళ్ళి తమిళ భాషలో విజయవంతమైన జీవనాంశం చిత్రం ఆధారంగా నిర్మించబడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1970 ఫిబ్రవరి 14న విడుదలయ్యింది.

మళ్ళీ పెళ్ళి
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం కృష్ణ ,
విజయనిర్మల
నిర్మాణ సంస్థ మిత్రా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • నిర్మాత: టి.సూర్యనారాయణ
 • దర్శకత్వం: సి.ఎస్.రావు
 • కథ: మల్లియం రాజ్‌గోపాల్
 • సంభాషణలు: ఆరుద్ర
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • నృత్యం: రాజు, శేషు
 • కూర్పు: ఆర్.హనుమంతరావు
 • కళ: పి.వెంకట్రావు
 • ఛాయాగ్రహణం: జి.కె.రాము

కథ మార్చు

జానకిరామయ్య పలుకుబడి, ఆస్తి, అంతస్తువున్న వ్యక్తి. అతని భార్య సీత. తల్లి నిర్మలమ్మ, కుమారుడు మోహన్, కోడలు జయ, కుమార్తె విజయలక్ష్మి. జానకిరామయ్య స్నేహితుడు ధర్మారావు ఓ వకీలు. అతని భార్య రాజ్యం. ఆమె తమ్ముడు పాపారావు. ధర్మారావు స్నేహితుడు చలమయ్య, అతని మేనల్లుడు వేణుగోపాల్, సోదరి విజయలక్ష్మి. తల్లిదండ్రులు లేని ఆ ఇద్దరినీ చలమయ్య పెంచి పెద్ద చేస్తాడు. లక్ష్మి కాలేజీలో చదువుతుంటుంది. వేణు ఉద్యోగం చేస్తుంటాడు. ధర్మారావు సూచనతో చలమయ్య మేనల్లుడు వేణు మంచితనం గురించి తెలుసుకున్న జానకిరామయ్య, తన కుమార్తె విజయకు అతనితో వివాహం జరిపిస్తాడు. వేణు చెల్లెలిని ఇంట్లో అంతా లక్ష్మి అని పిలవటం అలవాటు. వేణు చెల్లెలు లక్ష్మి, మెడిసిన్ చదువుతున్న శేఖర్ ప్రేమించుకుంటారు. కట్నంకోసం ఆశపడిన శేఖర్ తండ్రి ధూళిపాళ, తన కొడుక్కి వేరే సంబంధం ఖాయం చేస్తాడు. అది తప్పించుకోవటానికి శేఖర్ పిచ్చివాడిగా నటిస్తాడు. శేఖర్‌కు పెళ్లి కుదిరిందని తెలుసుకున్న లక్ష్మి ప్రమాదానికి గురై మరణిస్తుంది. లక్ష్మి, శేఖర్‌ల ప్రేమ విషయం తెలిసిన విజయ, భర్తకు ఆ సంగతి చెప్పబోయినా వీలుకాదు. శేఖర్ లక్ష్మికి వ్రాసిన ఉత్తరంలో అతడు విజయగా ప్రేమించింది తన సోదరి అని తెలియక, తన భార్య తప్పు చేసిందని భావించి. వేణు ఆమెకు కోర్టుద్వారా విడాకులిస్తాడు. పుట్టింట్లో విచారంతోవున్న విజయ పరిస్థితులు మరింత అస్తవ్యస్తంగా మారటం, మోహన్ ఇచ్చిన పేపరు ప్రకటన ద్వారా శేఖర్, వేణు ఇంటికి వచ్చి జరిగిన నిజం వెల్లడించటం, తన ప్రేయసి మరణానికి చింతించటం, నిజం తెలుసుకున్న వేణు నిరాశతో వెనుదిరిగిన విజయను గుడిలో కలుసుకొని క్షమాపణ కోరి.. విడాకులద్వారా వేరైనవారు దాన్ని రద్దుచేసికొని తిరిగి మళ్లీ పెళ్లి చేసుకోవటంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు మార్చు

 1. ఆగమంటే ఆగలేను - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 2. అమ్మా భవానీ జననీ - రచన: ఆరుద్ర - గానం: ఎస్.జానకి
 3. ఇదే నా భారతీయమేనా ఇది సదాచారమేనా - రచన: ఆరుద్ర - గానం: ఘంటసాల
 4. శుభముహూర్తంబున సొంపుగా పెళ్లి కూతురును (పద్యం) - రచన: ఆరుద్ర - గానం: ఘంటసాల
 5. మలయ పవనాలు వీచి - రచన: ఆరుద్ర -గానం: ఎస్.జానకి
 6. ఈ చిన్నది లేత వయసుది ఎవరిది, ఎవరిది - రచన: అప్పారావు - గానం: ఎల్. ఆర్. ఈశ్వరి
 7. జీవితం ఎంతో తియ్యనిది అది అంతా నీలో - రచన: అప్పారావు - గానం: పి సుశీల

మూలాలు మార్చు

 1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి. "ఫ్లాష్ బ్యాక్ @ 50 మళ్ళీ పెళ్ళి". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 13 June 2020.

బయటిలింకులు మార్చు